Monday, September 12, 2016

క్షీరసాగరమథనం – తన తూపులన్నియుఁ

8-336-సీ.
న తూపులన్నియుఁ రమిడి శక్రుండు
ఱికిన జోదు విన్ననువు మెఱసి
లి మహాశక్తిచేఁ ట్టిన నదియును
తఁడు ఖండించె నత్యద్భుతముగ
ఱి ప్రాస శూల తోరములు గైకొన్న
దోడ్తోడ నవియును దునిమివైచె
నంతటఁ బోక యెయ్యది వాఁడు సాగించెఁ
దొడరి తా నదియును దురుము జేసె;
8-336.1-ఆ.
సురభర్త విరథుఁడై తన పగఱకుఁ
గానఁబడక వివిధ పట వృత్తి
నేర్పు మెఱసి మాయ నిర్మించె మింటను
వేల్పుగములు చూచి వెఱఁగు పడఁగ.

టీకా:
            తన = తన యొక్క; తూపులు = బాణములు; అన్నియున్ = సమస్తము; తరమిడి = వరసపెట్టి; శక్రుండు = ఇంద్రుడు; నఱకినన్ = నరకివేయగా; జోదు = వీరుడు (బలి); విన్న = నేర్పుగల; అనువున్ = యుక్తితో; మెఱసి = మించి; బలి = బలి; మహా = గొప్ప; శక్తిన్ = ఆయుధవిశేషమును; చేపట్టినన్ = తీసుకొనగా; అదియునున్ = దానినికూడ; అతడు = అతడు; ఖండించెన్ = ముక్కలుచేసెను; అతి = మిక్కిలి; అద్భుతముగన్ = అపూర్వముగా; మఱి = ఇంకను; ప్రాస = ఈటె; శూల = శూలము; తోమరములున్ = ఆయుధవిశేషమును; కైకొన్న = చేపట్టిన; తోడ్తోడన్ = వెంటనే; అవియునున్ = వాటినికూడ; తునిమివైచె = ముక్కలుచేసెను; అంతటన్ = అంతటితో; పోక = విడువక; ఎయ్యది = దేనిని; వాడు = అతడు; సాగించెన్ = వేసిన; తొడరి = పూని; తాన్ = అతను; అదియునున్ = దానినికూడ; తురుముజేసె = తునాతునకలుచేసెను; అసురభర్త = బలి.
            విరథుడు = రథములేనివాడు; ఐ = అయ్యి; తన = తన యొక్క; పగఱ = శత్రువున; కున్ = కు; కానబడక = కనిపించకుండ; వివిధ = పలు; కపట = మాయా; వృత్తిన్ = జాలమునందు; నేర్పు = నేర్పరితనము; మెఱసి = చూపుతూ; మాయన్ = మాయను; నిర్మించెన్ = సృష్టించెను; మింటను = ఆకాశములో; వేల్పు = దేవతా; గములు = సమూహములు; చూచి = చూసి; వెఱగుపడగన్ = ఆశ్చర్యపోవునట్లు.

భావము:
          దుష్టులను శిక్షించుట యందు శక్తి గల ఇంద్రుడు తన బాణాలన్నింటినీ వరసపెట్టి ఖండించగా, యోధుడైన బలి ఉపాయంతో గొప్పదయిన శక్తి ఆయుధాన్ని చేపట్టాడు. దానినికూడ ఆశ్చర్యంగా ఇంద్రుడు ఖండించాడు. పిమ్మట బలి ఈటె, శూలం, తోమర అందుకోగా, వెంటనే వాటిని కూడా ఇంద్రుడు తునాతునకలు చేసాడు. అక్కడితో ఆపకుండా, బలి వేటిని ఎక్కుపెట్టినా వాటన్నిటినీ, ఇంద్రుడు పట్టుదలగా ముక్కలు ముక్కలు చేసేశాడు. అంతట బలి రథాన్ని విడిచిపెట్టి, తన నేర్పు ప్రదర్శిస్తూ, శత్రువులకు కనబడకుండా చేసే పలు మాయలను పన్నాడు. ఆకాశంలో మాయను కల్పించాడు. దానిని చూసి దేవతా సమూహాలు భయపడిపోయాయి.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: