Sunday, September 25, 2016

క్షీరసాగరమథనం – శూల నిహతి


8-364-ఆ.
శూల నిహతి నొంది స్రుక్కక యార్చిన
సూతు వెఱకు మంచు సురవిభుండు
వాని శిరముఁ దునిమె జ్రఘాతంబున
దైత్య సేన లెల్ల ల్ల డిల్ల.
8-365-చ.
ని సురనాథుచేఁ గలన జంభుఁడు చచ్చుట నారదుండు చె
ప్పి విని వాని భ్రాతలు గభీర బలాధికుఁ డా బలుండు పా
ముచు లా పురందరునిఁ గాంచి ఖరోక్తులఁ దూలనాడుచున్
జలధారలన్ నగముఁ ప్పిన చాడ్పునఁ గప్పి రమ్ములన్.

టీకా:
            శూల = బల్లెము; నిహతిన్ = దెబ్బ; ఒంది = పొందినను; స్రుక్కక = తల్లడిల్లకుండగ; ఆర్చిన = కేకలువేయగ; సుతున్ = పుత్రుని; వెఱకుము = బెదిరిపోకుము; అంచున్ = అనుచు; సురవిభుండు = ఇంద్రుడు; వాని = అతని; శిరమున్ = తలను; తునిమెన్ = తరిగెను; వజ్ర = వజ్రము యొక్క; ఘాతంబునన్ = దెబ్బతో; దైత్య = రాక్షస; సేనన్ = సైన్యములు; ఎల్లన్ = అన్ని; తల్లడిల్ల = చెల్లాచెదురుకాగా.
            చని = వెళ్ళి; సురనాథు = ఇంద్రుని; చేన్ = వలన; కలనన్ = యుద్ధభూమిలో; జంభుడు = జంభాసురుడు; చచ్చుట = మరణించుట; నారదుండు = నారదుడు; చెప్పినన్ = తెలియజెప్పగా; విని = విని; వాని = అతని; భ్రాతలు = సోదరులు; గభీర = గంభీరమైన; బల = బలముతో; అధికులు = గొప్పవారు; ఆ = ఆ; బలుండు = బలుడూ; పాక = పాకుడు; నముచులు = నముచిలు; ఆ = ఆ; పురందరుడు = ఇంద్రుని; కాంచి = చూసి; ఖర = వాడియైన; ఉక్తులన్ = పలుకులు; ఆడుచున్ = పలుకుతూ; ఘన = మేఘములయొక్క; జల = నీటి; ధారలన్ = ధారలతో; నగమున్ = కొండను; కప్పిన = కప్పివేసిన; చాడ్పునన్ = విధముగ; కప్పిరి = కప్పివేసిరి; అమ్ములన్ = బాణములతో.

భావము:
          జంభాసురుని బల్లం దెబ్బతిని, తల్లడిల్లకుండా మాతలి గట్టిగా కేకలు వేసాడు. అతనిని భయపడవద్దని చెప్పి, ఇంద్రుడు వజ్రాయుధంకో జంభుని తల నరికాడు. అది చూసి, రాక్షస సైన్యాలు చెల్లాచెదురు అయ్యాయి.
          నారదుని ద్వారా మహా బలవంతలు అయిన జంభాసురుని సోదరులు బలుడూ,  పాకుడూ, నముచీ, అతను యుద్ధంలో చనిపోయాడని అని తెలుసుకున్నారు. వారు రణరంగంలోకి దుమికారు. శత్రు పురములను వ్రక్కలించు వాడు అయిన ఇంద్రుని సూటీపోటీ మాటలతో నిందించారు. మేఘాలు వర్షధారలతో కొండను కప్పేసినట్లు, తమ బాణాలతో ఇంద్రుని కప్పివేసారు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: