Thursday, March 31, 2016

దేవతల నరసింహ స్తుతి - త్రిభువనశత్రుఁడు


7-333-వ.
వైతాళికు లిట్లనిరి.
7-334-క.
త్రిభువనశత్రుఁడు పడియెను
లందును మఖము లందు గదీశ్వర! నీ
శుగీతములు పఠించుచు
యులమై సంచరింతు మార్తశరణ్యా!
టీకా:
          వైతాళికులు = మేలుకొలుపు పాడు వారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          త్రిభువన = ముల్లోకములకు; శత్రుడు = శత్రువు; పడియెన్ = చనిపోయెను; సభలు = సభలు; అందును = లోను; మఖములు = యజ్ఞములు; అందున్ = లోను; జగదీశ్వర = నరసింహుడా {జగదీశ్వరుడు - జగత్ (భువనములకు) ఈశ్వరుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; శుభ = మంగళ; గీతములున్ = స్తోత్రములను; పఠించుచున్ = పాడుచు; అభయులము = భయములేనివారము; ఐ = అయ్యి; సంచరింతుము = తిరిగెదము; ఆర్తశరణ్య = నరసింహుడా {ఆర్తశరణ్యుడు - ఆర్తులైనవారికి శరణు యిచ్చువాడు, విష్ణువు}.
భావము:
            మేలుకొలుపులు పాడే వైతాళికులు ఇలా స్తుతించారు
            ఓ సకల భువన పాలకా! నరకేసరి! నీవు ఆర్తులకు శరణు ఇచ్చువాడవు. ముల్లోకాలకూ శత్రువు అయిన హిరణ్యకశిపుడు మరణించాడు. ఇంక యజ్ఞశాలలలోనూ, సభావేదికలమీదా నీ వీరగాథలు, యశోగీతాలు గానం చేస్తాం. నిర్భయంగా మా కర్తవ్యం మేము నిర్వహిస్తాము.”
७-३३३-व.
वैताळिकु लिट्लनिरि.
७-३३४-क.
त्रिभुवनशत्रुँडु पडियेनु
सभलंदुनु मखमु लंदु जगदीश्वर! नी
शुभगीतमुलु पठिंचुचु
नभयुलमै संचरिंतु मार्तशरण्या!

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: