7-307-వ.
రుద్రుం డిట్లనియె.
7-308-చ.
అమరవరేణ్య!
మీఁదట సహస్ర యుగాంతము నాఁడు గాని కో
పమునకు
వేళ గాదు సురబాధకుఁ డైన తమస్వినీచరున్
సమరమునన్
వధించితివి చాలుఁ ద
దాత్మజుఁడైన వీఁడు స
ద్విమలుఁడు
నీకు భక్తుఁడు పవిత్రుఁడు
గావుము భక్తవత్సలా!
టీకా:

అమర =
దేవతలలో; వరేణ్య = ఎన్నదగినవాడ; మీదట = రాబోవు కాలములో;
సహస్ర = వేలకొలది; యుగాంతము = ప్రళయ; నాడు = సమయమున; కాని =
తప్పించి; కోపమున్ = కోపమున; కున్ = కు;
వేళ = ఇది సమయము; కాదు = కాదు; సుర = దేవతలను; బాధకుడు
= బాధించువాడు; ఐన = అయిన; తమస్వినీచరున్
= రాక్షసుని {తమస్వినీచరుడు - తమస్ (చీకటి, రాత్రి) వేళ చరుడు (తిరుగువాడు), రాక్షసుడు};
సమరమునన్ = యుద్ధమునందు; వధించితివి =
సంహరించితివి; చాలున్ = ఇంక చాలును; తత్
= అతని; ఆత్మజుడు = పుత్రుడు {ఆత్మజుడు
- ఆత్మ (తనకు) జుడు (పుట్టినవాడు), కొడుకు}; ఐన = అయిన; వీడు = ఇతడు; సత్ =
చక్కటి; విమలుడు = నిర్మలుడు; నీ = నీ;
కున్ = కు; భక్తుడు = భక్తుడు; పవిత్రుడు = పావనమైనవాడు; కావుము = కాపాడుము;
భక్తవత్సలా = నరసింహుడా {భక్తవత్సలా - భక్తుల
యెడ వాత్సల్యము గల వాడు. విష్ణువు}.
భావము:
రుద్రుడు ఇలా పొగిడాడు.
“ఓ
దేవతోత్తమా! భక్తుల యెడ మిక్కిలి వాత్సల్యము గల మహానుభావా! ఇంకా వెయ్యి యుగాలు
గడచిన తరువాత కదా నీవు కోపం పూనాలి కానీ, (మహా ప్రళయం వేళ
అప్పటికి కాని రాదు కదా) ఆగ్రహానికి ఇది సమయం కాదు. దేవతలను బాధించే
దానవేశ్వరుడిని సంహంరించావు. బాగుంది. ఇంక చాలు. అతని కుమారుడు ఈ పిల్లవాడు.
కల్మషం లేనివాడు. నీకు భక్తుడు. పరమ పవిత్రుడు. ఇతనిని కరుణతో కాపాడు.”
७-३०७-व.
रुद्रुं डिट्लनिये.
७-३०८-च.
अमरवरेण्य! मीँदट सहस्र युगांतमु नाँडु गानि को
पमुनकु वेळ गादु सुरबाधकुँ डैन तमस्विनीचरुन्
समरमुनन् वधिंचितिवि चालुँ द दात्मजुँडैन वीँडु
स
द्विमलुँडु नीकु भक्तुँडु पवित्रुँडु गावुमु
भक्तवत्सला
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment