7-323-వ.
ప్రజాపతు లిట్లనిరి.
7-324-మ.
ప్రజలం
జేయుటకై సృజించితి మముం బాటించి; దైత్యాజ్ఞచేఁ
బ్రజలం
జేయక యింతకాలము మహాభారంబుతో
నుంటి; మీ
కుజనున్
వక్షముఁ జీరి చంపితివి; సంకోచంబు
లే కెల్ల చోఁ
బ్రజలం
జేయుచు నుండువారము జగద్భద్రాయమాణోదయా!
టీకా:
ప్రజాపతులు
= ప్రజాపతులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి =
పలికిరి.
ప్రజలన్
= లోకులను; చేయుట = పుట్టించుట; కై = కోసము; సృజించితి = పుట్టించితి; మమున్ = మమ్ములను; పాటించి = పూని; దైత్య = రాక్షసుని; ఆజ్ఞ = ఉత్తరువుల; చేత = వలన; ప్రజలన్
= లోకులను; చేయక = పుట్టించకుండగ;
ఇంత = ఇన్ని; కాలమున్ = దినములు; మహా = గొప్ప; భారంబు = దుఃఖభారము; తోన్ = తోటి; ఉంటిమి = ఉన్నాము; ఈ = ఈ; కుజనున్ = దుర్జనుని; వక్షమున్
= రొమ్మును; చీరి = చీల్చివేసి; చంపితివి
= సంహరించితివి; సంకోచంబుల్ = అనుమానములు; లేకన్ = లేకుండగ; ఎల్ల = అన్ని; చోన్ = చోటులందు; ప్రజలన్ = లోకులను; చేయుచున్ = చేయుచు; ఉండువారము = ఉంటాము; జగత్ = లోకములను; భద్రాయమాణ = క్షేమకరమగుటకు;
ఉదయా = అవతరించినవాడ.
భావము:
ప్రజాపతులు ప్రస్తుతిస్తూ ఇలా అన్నారు.
“ఓ నరకేసరీ! జగత్తులకు మేలు చేయుటకు అవతరించిన ప్రభువా! జగద్రక్షకా!
మమ్మల్ని ప్రజాసృష్టి చేయటం కోసమే సృష్టించావు. కానీ ఈ రాక్షసుడి ఆజ్ఞ మూలాన ఆ
ప్రజాసృష్టినే మానేయవలసి వచ్చింది. ప్రజా వ్యవస్థకు దురవస్థ దాపురించింది. ఆ
దుర్మతి హిరణ్యకశిపుని గుండెలు చీల్చి చంపావు. ఇంక ఏ సంకోచమూ లేకుండా ప్రజాసృష్టి
చేస్తుంటాము.”
७-३२३-व.
प्रजापतु लिट्लनिरि.
७-३२४-म.
प्रजलं जेयुटकै सृजिंचिति ममुं बाटिंचि; दैत्याज्ञचेँ
ब्रजलं जेयक यिंतकालमु महाभारंबुतो नुंटि; मी
कुजनुन् वक्षमुँ जीरि चंपितिवि; संकोचंबु ले केल्ल चोँ
ब्रजलं जेयुचु नुंडुवारमु जगद्भद्रायमाणोदया!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment