Tuesday, March 22, 2016

దేవతల నరసింహ స్తుతి - క్రుద్ధుండై

7-315-వ.
సిద్ధు లిట్లనిరి.
7-316-క.
క్రుద్ధుండై యణిమాదిక
సిద్ధులు గైకొనిన దైత్యుఁ జీరితివి; మహా
యోద్ధవు నీ కృప మాకును
సిద్ధులు మరలంగఁ గలిగె శ్రీనరసింహా!
టీకా:
          సిద్ధులు = సిద్ధులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          క్రుద్ధుండు = కోపముగలవాడు; = అయ్యి; అణిమాదిక = అణిమ మొదలైన; సిద్ధులున్ = అష్టసిద్ధులను {అష్టసిద్ధులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రా కామ్యము 7ఈశత్వము 8వశిత్వము}; కైకొనిన = తీసుకొన్న; దైత్యున్ = రాక్షసుని; చీరితివి = చంపితివి; మహా = గొప్ప; యోద్ధవున్ = యోధుడవు; నీ = నీ యొక్క; కృపన్ = దయవలన; మా = మా; కును = కు; సిద్ధులు = అష్టసిద్ధులు; మరలంగన్ = మళ్ళీ; కలిగెన్ = కలగినవి; శ్రీ = మహనీయమైన; నరసింహా = నరసింహుడా.
భావము:
            సిద్దులు నరసింహుని ప్రసిద్ధిని ఇలా ప్రశంసించారు.
            శ్రీ నరసింహావతారా! నీవు యోధానుయోధుడవు. ఆగ్రహోదగ్రుడై హిరణ్యకశిపుడు మా అణిమ, మహిమ, గరిమ మున్నగు సిద్ధులు అన్నింటిని లాక్కున్నాడు. ఆ రాక్షసుడిని చీల్చిచెండాడి సంహరించావు. మేలయ్యను. నీ దయ వలన మరల నా సిద్ధులు మాకు లభించాయి.”
७-३१५-व.
सिद्धु लिट्लनिरि.
७-३१६-क.
क्रुद्धुंडै यणिमादिक
सिद्धुलु गैकोनिन दैत्युँ जीरितिवि; महा
योद्धवु नी कृप माकुनु
सिद्धुलु मरलंगँ गलिगे श्रीनरसिंहा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: