7-300-శా.
రక్షోవీరుల
నెల్లఁ ద్రుంచి రణసంరంభంబు
చాలించి దృ
ష్టిక్షేపంబు
భయంకరంబుగ సభాసింహాసనారూఢుఁడై
యక్షీణాగ్రహుఁడై
నృసింహుఁడు కరాళాస్యంబుతో నొప్పెఁ దన్
వీక్షింపం
బలికింప నోడి యితరుల్ విభ్రాంతులై
డాఁగఁగన్.
టీకా:
రక్షస్ = రాక్షస; వీరులన్ = వీరులను; ఎల్లన్ = అందరను; త్రుంచి = సంహరించి; రణ = యుద్దమందలి; సంరంభంబున్ = ఆటోపమును; చాలించి = ఆపేసి; దృష్టి = చూపుల; క్షేపంబు = నిగుడ్చుట, ప్రసారము; భయంకరంబుగ = బెదురుకలుగునట్లు; సభా = సభయందలి; సింహాసన = సింహాసనమును; ఆరూఢుడు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; అక్షీణ = అధికమైన; ఆగ్రహుడు = కోపముగలవాడు; ఐ = అయ్యి; నృసింహుడు = నరసింహుడు; కరాళ = భయంకరమైన; ఆస్యంబు = ముఖము; తోన్ = తోటి; ఒప్పెన్ = చక్కగనుండెను; తన్ = తనను; వీక్షింపన్ = చూచుటకు; పలికింపన్ = పలకరించుటకు; ఓడి = బెదరి; ఇతరుల్ = ఇతరులు; విభ్రాంతులు = భీతిచెందినవారు;
ఐ = అయ్యి; డాగగన్ = దగ్గరచేరుటకు.
భావము:
ఈ విధంగా రాక్షస సంహారం కానిచ్చి, యుద్ధం
పరిసమాప్తి చేసాడు. ఇంకా ఆ ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు. ఆ చూపులు భయం
కలిగిస్తున్నాయి. భీకరమైన ముఖంతో ఊగిపోతున్నాడు. చూడటానికి గానీ, పలకరించడానికి కానీ చాలక అక్కడున్న వాళ్లందరూ భయభ్రాంతులై తత్తర పడుతుండగా,
ఆ భీకర నరకేసరి ఆ సభాభవనంలో సింహాసనంపై ఆసీను డయ్యాడు.
७-३००-शा.
रक्षोवीरुल नेल्लँ
द्रुंचि रणसंरंभंबु चालिंचि दृ
ष्टिक्षेपंबु
भयंकरंबुग सभासिंहासनारूढुँडै
यक्षीणाग्रहुँडै
नृसिंहुँडु कराळास्यंबुतो नोप्पेँ दन्
वीक्षिंपं बलिकिंप नोडि यितरुल्
विभ्रांतुलै डाँगँगन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment