Saturday, March 5, 2016

నృసింహరూపావిర్భావము – పంచాననోద్ధూత

7-291-సీ.
పంచాననోద్ధూత పావకజ్వాలలుభూనభోంతరమెల్లఁ బూరితముగ
దంష్ట్రాంకురాభీల గధగాయితదీప్తిసురేంద్రు నేత్రము లంధములుగఁ
గంటకసన్నిభోత్కట కేసరాహతిభ్రసంఘము భిన్నమై చలింపఁ
బ్రళయాభ్రచంచలాప్రతిమ భాస్వరములైరనఖరోచులు గ్రమ్ముదేర;
7-291.1-తే.
టలు జళిపించి గర్జించి సంభ్రమించి; దృష్టి సారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి; ట్టె నరసింహుఁ డా దితిట్టి నధిప!
టీకా:
పంచ = విప్పారిన; ఆనన = ముఖమునుండి; ఉద్ధూత = పుట్టిన; పావక = అగ్ని; జ్వాలలు = మంటలు; భూ = భూమి; నభస్ = ఆకాశము; అంతరము = మధ్యభాగము; ఎల్లన్ = అంతటిని; పూరితంబు = నిండినది; కన్ = కాగా; దంష్ట్రా = కోఱల; అంకుర = మొలకల యొక్క; అభీల = భయంకరమైన; ధగధగాయిత = ధగధగలాడెడి; దీప్తిన్ = ప్రకాశముచేత; అసుర = రాక్షస; ఇంద్రు = ప్రభువు యొక్త; నేత్రములు = కన్నులు; అంధములు = గుడ్డివి; కన్ = కాగా; కంటక = ముండ్ల; సన్నిభ = వంటి; ఉత్కట = వాడియైన, నిక్కిన; కేసర = రోమముల, జూలు; ఆహతిన్ = తాకిడికి; అభ్ర = మేఘముల; సంఘము = సమూహము; భిన్నము = విరిసినది; ఐ = అయ్యి; చలింపన్ = తిరుగగా; ప్రళయ = ప్రళయకాలపు; అభ్ర = మేఘముల యందలి; చంచలా = మెరపులకు; ప్రతిమ = సాటిరాగల; భాస్వరములు = కాంతులుగలవి; ఐ = అయ్యి; ఖర = వాడి; నఖర = గోళ్ళ యొక్క; రోచులు = కాంతులు; కమ్ముదేరన్ = వ్యాపింపగా. 
సటలు = జూలు; జళిపించి = జాడించి; గర్జించి = గర్జించి {గర్జన - సింహపు అరుపు}; సంభ్రమించి = చెలరేగి; దృష్టి = చూపు; సారించి = నిగిడించి; బొమలు = కనుబొమలు; బంధించి = ముడివేసి; కెరలి = విజృంభించి; జిహ్వ = నాలుక; ఆడించి = ఆడించి; లంఘించి = పైకురికి, దూకి; చేతన్ = చేతితో; ఒడిసిపట్టెన్ = ఒడుపుగాపట్టుకొనెను; నరసింహుండు = నరసింహుడు; = ; దితిపట్టిన్ = హిరణ్యకశిపుని; అధిపా = రాజా.
భావము:
ఉగ్ర నరసింహస్వామి యొక్క సింహముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలలో వెలువడిన అగ్నిజ్వాలలతో భూమ్యాకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల ధగ ధగ కాంతులు హిరణ్యకశిప రాక్షసుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి. ముళ్ళల్లా ఉన్న ఆయన కేసరాల విదలింపులకు ఆకాశంలోని మేఘపంక్తులు చెల్లాచెదరైపోయాయి. ఆ నరహరి కాలిగోరుల నుండి వెలువడే తీక్షణములైన కాంతులు, ప్రళయకాలపు మేఘాలలోని మెరుపు తీగలలా మెరుస్తున్నాయి. ఆ నారసింహుడు అదను చూసి జటలు ఝళిపించాడు, ఒక్కసారిగా గర్జించి హుంకరించాడు, కనుబొమలు ముడిచి తీక్షణంగా వీక్షించాడు, ఆ ఉగ్రమూర్తి వికృతంగా తన నాల్కను ఆడించి, ఆ రాక్షసుడిపై విజృంభించి దూకి ఒడిసి పట్టుకున్నాడు.
७-२९१-सी.
पंचाननोद्धूत पावकज्वाललु; भूनभोंतरमेल्लँ बूरितमुग;
दंष्ट्रांकुराभील धगधगायितदीप्ति; नसुरेंद्रु नेत्रमु लंधमुलुगँ;
गंटकसन्निभोत्कट केसराहति; नभ्रसंघमु भिन्नमै चलिंपँ;
ब्रळयाभ्रचंचलाप्रतिम भास्वरमुलै; खरनखरोचुलु ग्रम्मुदेर;
७-२९१.१-ते.
सटलु जळिपिंचि गर्जिंचि संभ्रमिंचि; दृष्टि सारिंचि बोमलु बंधिंचि केरलि
जिह्व याडिंचि लंघिंचि चेत नोडिसि; पट्टे नरसिंहुँ डा दितिपट्टि नधिप!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: