7-302-క.
తర్షంబుల
నరసింహుని
హర్షంబులఁ
జూచి నిర్జరాంగనలు మహో
త్కర్షంబులఁ
గుసుమంబుల
వర్షంబులు
గురిసి రుత్సవంబుల నధిపా!
టీకా:
తర్షంబులన్ = ఆదరముతో; నరసింహుని = నరసింహుని; హర్షంబులన్ = ఆనందములతో;
చూచి = చూసి; నిర్జర = దేవ {నిర్జరులు - జర (ముదిమి)లేనివారు, దేవతలు}; అంగనలు = స్త్రీలు; మహా = గొప్పగా; ఉత్కర్షంబులన్ = అతిశయములతో; కుసుమంబుల = పూల;
వర్షంబులు = వానలను; కురిసిరి = కురిపించిరి;
ఉత్సవంబులన్ = పండుగలుచేయుచు; అధిపా = రాజా.
భావము:
ఓ మహారాజా! నరసింహరూపుడి విజయోత్కర్షం
చూసిన దేవకాంతలు ఆదర ఆనందాతిరేకాలతో పూలవానలు కురిపించారు. ఆనందంతో ఉత్సవాలు
చేసుకున్నారు.
७-३०२-क.
तर्षंबुल नरसिंहुनि
हर्षंबुलँ जूचि निर्जरांगनलु महो
त्कर्षंबुलँ गुसुमंबुल
वर्षंबुलु गुरिसि रुत्सवंबुल नधिपा!
http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=9&Padyam=302.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment