Thursday, March 17, 2016

దేవతల నరసింహ స్తుతి - ఘనలీలాగుణ

7-305-వ.
ఆ సమయంబున దేవత లందఱు వేఱువేఱ వినుతించిరి; అందుఁ గమలాసనుం డిట్లనియె.
7-306-మ.
లీలాగుణచాతురిన్ భువనముల్ ల్పించి రక్షించి భే
ముం జేయు దురంతశక్తికి ననంజ్యోతికిం జిత్ర వీ
ర్యునికిన్ నిత్యపవిత్రకర్మునికి నే నుత్కంఠతో నవ్యయా
త్మునికిన్ వందన మాచరించెదఁ గృపాముఖ్య ప్రసాదార్థి నై.
టీకా:
            ఆ = ఆ; సమయంబునన్ = సమయములో; దేవతలు = దేవతలు; అందఱున్ = అందరును; వేఱువేఱ = వేరవేరుగా; వినుతించిరి = స్తుతించిరి; అందున్ = వారిలో; కమలాసనుండు = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలము (పద్మము)ను ఆసనుడు (ఆసనముగా గలవాడు), బ్రహ్మ}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
          ఘన = గొప్ప; లీలా = వేడుకగా ధరించెడి; గుణ = గుణత్రయమును {గుణత్రయము - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; చాతురిన్ = నేర్పుచేత; భువనముల్ = లోకములను; కల్పించి = సృష్టించి; రక్షించి = కాపాడి; భేదనమున్ = నాశనము; చేయు = చేసెడి; దురంత = ఆపలేని; శక్తి = శక్తిగలవాని; కిన్ = కి; అనంత = అపరిమిత; జ్యోతి = తేజముగలవాని; కిన్ = కి; చిత్ర = అబ్బురమైన; వీర్యున్ = పరాక్రమముగలవాని; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడును; పవిత్ర = పావనములైన; కర్మున్ = కర్మములుచేయువాని; కిన్ = కి; నేను = నేను; ఉత్కంఠ = వేడుక; తోన్ = తోటి; అవ్యయ = నాశములేని; ఆత్మ = ఆత్మస్వరూపుని; కిన్ = కి; వందనము = నమస్కారము; ఆచరించెదన్ = చేసెదను; కృపా = దయ; ముఖ్య = మొదలైన; ప్రసాద = అనుగ్రమును; అర్థిన్ = కోరువాడను; ఐ = అయ్యి.
భావము:
            ఆ సమయంలో అలా నమస్కరించిన దేవతలు అందరూ ఎవరికి వారు వివిధ రీతులలో స్తుతించారు. వారిలో పద్మం ఆసనంగా కలిగిన బ్రహ్మదేవుడు ఇలా సన్నుతించాడు.
            గొప్ప లీలావిలాసాలలా ఈ అఖిల ప్రపంచాన్ని సృష్టించటం, పోషించటం, హరించటం అనే మహాకార్యాలను అవలీలగా నిర్వహించే ఓ మహా శక్తి స్వరూపా! ఆపరాని మహా శక్తి స్వరూపా! అపరిమిత తేజో మూర్తీ! అబ్బురమైన పరాక్రమశాలీ! నిత్య పవిత్రకర్మానుసారిణీ! నాశరహితుడైన పరమాత్మా! నేను మిక్కిలితర ఆసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ ప్రణామాలు ఆచరిస్తున్నాను. దేవా! స్వీకరించు.”
७-३०५-व.
आ समयंबुन देवत लंदर्रु वेर्रुवेर्र विनुतिंचिरि; अंदुँ गमलासनुं डिट्लनिये.
७-३०६-म.
घनलीलागुणचातुरिन् भुवनमुल् कल्पिंचि रक्षिंचि भे
दनमुं जेयु दुरंतशक्तिकि ननंतज्योतिकिं जित्र वी
र्युनिकिन् नित्यपवित्रकर्मुनिकि ने नुत्कंठतो नव्यया
त्मुनिकिन् वंदन माचरिंचेदँ गृपामुख्य प्रसादार्थि नै.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: