7-297-సీ.
వక్షకవాటంబు వ్రక్కలు
చేయుచో; ఘన కుఠారంబుల కరణి నొప్పు;
గంభీర హృదయ పంకజము
భేదించుచోఁ; గుద్దాలముల
భంగిఁ గొమరుమిగులు;
ధమనీ వితానంబు దవిలి ఖండించుచోఁ; బటు లవిత్రంబుల పగిది మెఱయు;
జఠరవిశాలాంత్రజాలంబుఁ
ద్రెంచుచోఁ; గ్రకచ
సంఘంబుల గరిమఁ
జూపు;
7-297.1-తే.
నంకగతుఁడైన దైత్యుని నాగ్రహమున; శస్త్ర చయముల
నొంపక సంహరించి
యమరు నరసింహు నఖరంబు లతి విచిత్ర; సమర ముఖరంబులై
యుండె జనవరేణ్య!
టీకా:
వక్ష = రొమ్ము యనెడి; కవాటంబున్ = కవాటమును; వ్రక్కలు = ముక్కలు; చేయు = చేసెడి; చోన్ = అప్పుడు; ఘన = పెద్ద; కుఠారంబులన్ = గొడ్ఢళ్ళు; కరణిన్ = వలె; ఒప్పున్ = చక్కగానుండును; గంభీర = లోతైన; హృదయ =
హృదయమనెడి; పంకజమున్ = పద్మమును {పంకజము
- పంకము (బురద) యందు జము (పుట్టునది), పద్మము}; భేదించు = బద్దలుచేసెడి; చోన్ = అప్పుడు; కుద్దాలముల = గునపముల; భంగిన్
= వలె; కొమరు = చక్కదనము; మిగులు =
అతిశయించును; ధమనీ = నరముల; వితానంబున్
= సమూహమునలను; తవిలి = పూని; ఖండించు =
కోసివేసెడి; చోన్ = అప్పుడు; లవిత్రంబుల
= కొడవళ్ళ; పగిదిన్ = వలె; మెఱయున్ =
ప్రకాశించును; జఠర = కడుపులోని; విశాల
= పొడవైన; అంత్ర = పేగుల; జాలంబున్ =
సమూహమును; త్రెంచు = తెంచివేసెడి; చోన్
= అప్పుడు; క్రకచ = రంపముల; సంఘంబుల =
సమూహముల యొక్క; గరిమన్ = గొప్పదనమును;
చూపున్ = ప్రదర్శించును; అంక = ఒడిలో.
గతుడు = ఉన్నవాడు; ఐన = అయిన; దైత్యుని = రాక్షసుని; ఆగ్రహమునన్ = కోపముతో; శస్త్ర = ఆయుధముల; చయమున్ = సమూహమును; ఒంపక = ప్రయోగించకుండగ; సంహరించి = చంపి; అమరు = ఒప్పుచున్న; నరసింహు = నరసింహుని; నఖరంబులు
= గోళ్ళు; అతి = మిక్కలి; విచిత్ర =
అబ్బురమైన; సమర = యుద్ధ; ముఖరంబులు =
సాధనములు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను;
జనవరేణ్య = రాజా {జనవరేణ్యుడు - జన (మానవులలో)
వరేణ్యుడు (శ్రేష్ఠుడు), రాజు}.
భావము:
ఆ ఉగ్ర నరసింహుని గోళ్ళు ఆ రాక్షసుని వక్ష కవాటం పగులగొట్టేటప్పుడు
గండ్రగొడ్డళ్ళలా విరాజిల్లాయి. హృదయపద్మం పెకలించేటప్పుడు త్రవ్వుగోలల వలె
దీపించాయి. రక్తనాళాలు త్రెపేటప్పుడు బలిష్ఠమైన కొడవళ్ళు వలె ప్రకాశించాయి.
ప్రేగులు కోసేటప్పుడు రంపాలలాగా రాణించాయి. తన ఊరువులపై పడి ఉన్న రాక్షసుడిని
ఎలాంటి అస్త్రశస్త్రాలతోనూ పనిలేకుండా నరకేసరి తన గోళ్ళతోనే సంహరించాడు. అప్పుడు ఆ
గోళ్ళు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి.
७-२९७-सी.
वक्षकवाटंबु
व्रक्कलु चएयुचो; घन कुठारंबुल
करणि नोप्पु;
गंभीर हृदय
पंकजमु भेदिंचुचोँ; गुद्दालमुल भंगिँ
गोमरुमिगुलु;
धमनी वितानंबु
दविलि खंडिंचुचोँ; बटु लवित्रंबुल
पगिदि मेर्रयु;
जठरविशालांत्रजालंबुँ
द्रेंचुचोँ; ग्रकच संघंबुल गरिमँ जूपु;
७-२९७.१-ते.
नंकगतुँडैन
दैत्युनि नाग्रहमुन; शस्त्र चयमुल
नोंपक संहरिंचि
यमरु नरसिंहु नखरंबु लति
विचित्र; समर मुखरंबुलै युंडे
जनवरेण्य!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment