7-292-క.
సరకుగొనక
లీలాగతి
నురగేంద్రుఁడు
మూషికంబు నొడసిన
పగిదిన్
నరకేసరి
దను నొడిసిన
సురవిమతుఁడు
ప్రాణభీతి సుడివడియె
నృపా!
7-293-క.
సురరాజవైరి
లోఁబడెఁ
బరిభావిత
సాధుభక్త పటలాంహునకున్
నరసింహునకు
నుదంచ
త్ఖరతరజిహ్వున
కుదగ్ర ఘన
రంహునకున్.
టీకా:
సరకుగొనక = లక్ష్యపెట్టక; లీలా = క్రీడ; గతిన్ = వలె;
ఉరగ = సర్ప; ఇంద్రుడు = రాజు; మూషికంబున్ = ఎలుకను; ఒడసిన = ఒడుపుగాపట్టుకొను;
పగిదిన్ = విధముగ; నరకేసరి = నరసింహుడు;
తను = తనను; ఒడిసినన్ = ఒడిసిపట్టగా; సుర = దేవతలకు; విమతుడు = శత్రువు; ప్రాణ = ప్రాణములమీది; భీతిన్ = భయముచేత; సుడివడియెన్ = కలగిపోయెను; నృపా = రాజా.
సుర = దేవతల; రాజ = ప్రభువుల; వైరి = శత్రువు; లోబడెన్ = లొంగిపోయెను; పరిభావిత = తిరస్కరింపబడిన;
సాధు = సజ్జనులైన; భక్త = భక్తుల; పటల = సంఘముల యొక్క; అంహున = పాపములుగలవాని; కున్ = కి; నరసింహునకున = నరసింహుని; కును = కి; ఉదంచత్ = మెఱయుచున్న; ఖరతర = మిక్కిలిగరుకైన {ఖర - ఖరతర - ఖరతమ}; జిహ్వున్ = నాలుకగలవాని; కున్ = కి; ఉదగ్ర = ఘనమైన; ఘన = గొప్ప; రంహున్
= వేగముగలవాని; కున్ = కు.
భావము:
నాగేంద్రుడు ఎలుకను ఏమాత్రం లెక్కచేయకుండా
ఒడిసిపట్టినట్లుగా, ఆ నరసింహ ప్రభువు పట్టుకోడంతో, ఆ దేవతా శత్రువు అయిన హిరణ్యకశిపుడు ప్రాణభీతితో సుళ్ళు తిరిగిపోయాడు.
సాధుజనుల, భక్తుల అందరి పాపాలను పటాపంచలు చేసేవాడు, కడు
భయంకరంగా కదులుచున్న నాలుక గలవాడు, మహోగ్రమైన వేగం గలవాడు
అయిన నరసింహ దేవుడికి, ఇంద్రుని శత్రువైన హిరణ్యకశిపుడు
లోబడిపోయాడు.
७-२९२-क.
सरकुगोनक लीलागति
नुरगेंद्रुँडु मूषिकंबु नोडसिन पगिदिन्
नरकेसरि दनु नोडिसिन
सुरविमतुँडु प्राणभीति सुडिवडिये नृपा!
७-२९३-क.
सुरराजवैरि लोँबडेँ
बरिभावित साधुभक्त पटलांहुनकुन्
नरसिंहुनकु नुदंच
त्खरतरजिह्वुन कुदग्र घन रंहुनकुन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment