7-313-వ.
పిత్రుదేవత లిట్లనిరి.
7-314-శా.
చండక్రోధముతోడ
దైత్యుఁడు వడిన్ శ్రాద్ధంబులన్
మత్సుతుల్
పిండంబుల్
సతిలోదకంబులుగ నర్పింపంగ మా
కీక యు
ద్దండత్వంబునఁ
దాన కైకొను మహోదగ్రుండు; వీఁ డిక్కడన్
ఖండింపంబడె
నీ నఖంబుల నుతుల్ గావింతు
మాత్మేశ్వరా!
టీకా:
పిత్రుదేవతలు
= పిత్రుదేవతలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
చండ =
తీవ్రమైన; క్రోధము = కోపము; తోడన్ = తోటి; దైత్యుడు = రాక్షసుడు; వడిన్ = వేగముగ; శ్రాద్ధంబులన్ = ఆబ్దికములాది పితృకర్మలలో; మత్ = మా
యొక్క; సుతుల్ = సంతతివారు; పిండంబులన్
= పిండములను; సతిలోదకంబులుగన్ = నువ్వులు నీళ్ళతో కూడినవిగా;
అర్పింపంగన్ = సమర్పించుతుండగా; మా = మా;
కున్ = కు; ఈక = ఈయకుండ; ఉద్ధండత్వంబునన్ = దాష్టీకముతో; తాన = తనే; కైకొనున్ = స్వీకరించును; మహా = మిక్కలి; ఉదగ్రుండు = క్రూరుడు; వీడు = ఇతడు; ఇక్కడన్ = ఇక్కడ; ఖండింపంబడె = చంపబడెను; నీ = నీ; నఖంబులన్ = గోళ్ళతోటి; నుతుల్ = స్తోత్రములను; కావింతుము = చేసెదము;
ఆత్మేశ్వరా = నరసింహుడా {ఆత్మేశ్వరుడు - ఆత్మ (తమయొక్క) ఈశ్వరుడు (దేవుడు), విష్ణువు}.
భావము:
పిత్రుదేవతలు ఇలా ప్రణతులు అర్పించారు.
“ఓ పరమాత్మా! నరసింహరూపా! మా సుతులు మా సుగతుల కోసం శ్రాద్ధాలు
పెడుతున్నారు; పిండాలు, నువ్వులు
నీళ్ళూ వదులుతున్నారు. కాని అవి మాకు అందనీయకుండా ఈ హిరణ్యాక్ష అసురుడు అమిత
కోపంతో వేగంగా వచ్చి, హరించి, పట్టుకు
పోయేవాడు. ఆ స్వార్థపర దుండగీడుని ఇక్కడ సంహరించావు. మా కష్టాలు తీర్చావు. నీకు
నమస్కారములు”
७-३१३-व.
पित्रुदेवत लिट्लनिरि.
७-३१४-शा.
चंडक्रोधमुतोड दैत्युँडु वडिन् श्राद्धंबुलन्
मत्सुतुल्
पिंडंबुल् सतिलोदकंबुलुग नर्पिंपंग मा कीक यु
द्दंडत्वंबुनँ दान कैकोनु महोदग्रुंडु; वीँ डिक्कडन्
खंडिंपंबडे नी नखंबुल नुतुल् गाविंतु
मात्मेश्वरा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment