7-321-వ.
మనువు లిట్లనిరి.
7-322-క.
దుర్ణయుని
దైత్యుఁ బొరిగొని
వర్ణాశ్రమ
ధర్మసేతు వర్గము
మరలం
బూర్ణము
చేసితి వే మని
వర్ణింతుము? కొలిచి బ్రతుకువారము
దేవా!
టీకా:
మనువులు
= మనువులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
దుర్ణయుని
= దుర్నీతిగలవానిని; దైత్యున్ = రాక్షసుని; పొరిగొని = చంపి; వర్ణ = వర్ణముల యొక్క ధర్మముల;
ఆశ్రమధర్మ = ఆశ్రమధర్మముల; సేతు = కట్టుబాట్ల;
వర్గమున్ = సమూహమును; మరలన్ = తిరిగి; పూర్ణము = పరిపూర్ణము; చేసితివి = చేసితివి; ఏమని = ఏమని; వర్ణింతుము = కీర్తింతుము; కొలిచి = సేవించి; బ్రతుకు = జీవించెడి; వారము = వారిమి; దేవా = నరసింహా.
భావము:
మనువులు ఇలా మనవి చేసుకున్నారు.
“ఓ దేవా! ఈ
దుష్టుని వలన వర్ణాశ్రమ ధర్మాలు ధ్వంసం అయ్యాయి. ఈ రాక్షసుడైన హిరణ్యకశిపుని చంపి
తిరిగి ధర్మం సంస్థాపన కావించావు. నిన్ను ఏమని కీర్తించ గలము? ఎలా స్తుతించ గలము? నీ సేవే మాకు జీవనాధారం ప్రభూ!”
७-३२१-व.
मनुवु लिट्लनिरि.
७-३२२-क.
दुर्णयुनि दैत्युँ बोरिगोनि
वर्णाश्रम धर्मसेतु वर्गमु मरलं
बूर्णमु चेसिति वे मनि
वर्णिंतुमु? कोलिचि ब्रतुकुवारमु देवा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment