7-301-క.
సుర చారణ
విద్యాధర
గరుడోరగ
యక్ష సిద్ధగణములలో నొ
క్కరుఁ డైన
డాయ వెఱచును
నరహరి న
య్యవసరమున నరలోకేశా!
టీకా:
సుర = దేవతల; చారణ = చారణుల; విద్యాధర = విద్యాధరుల; గరుడ = గరుడుల; ఉరగ = సర్పముల; యక్ష = యక్షుల; సిద్ధ = సిద్దుల; గణముల = సమూహముల; లోన్ = అందు; ఒక్కరుడు = ఒకడు; ఐనన్ = అయినను; డాయన్ = దగ్గరచేరుటకు; వెఱచును
= బెదురును; నరహరిన్ = నరసింహుని; ఆ =
ఆ; అవసరంబునన్ = సమయములో; నరలోకేశ =
రాజా {నరలోకేశుడు - నరలోక (నరలోకుల) కు ఈశుడు (ప్రభువు),
రాజు}.
భావము:
ధర్మరాజా! దేవతలు, చారణులు,
విద్యాధరులు, గరుడులు, నాగులు,
యక్షులు, సిద్ధులు మొదలైన వారిలో ఏ ఒక్కరు కూడ
ఆ సమయంలో ఆ ఉగ్ర నరకేసరి దరిదాపులకు వెళ్ళటానికి సాహసించలేక భయకంపితు లౌతున్నారు.
७-३०१-क.
सुर चारण विद्याधर
गरुडोरग यक्ष
सिद्धगणमुललो नो
क्करुँ डैन डाय
वेर्रचुनु
नरहरि न य्यवसरमुन नरलोकेशा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment