Friday, April 1, 2016

దేవతల నరసింహ స్తుతి - ధర్మము దలఁపడు


7-335-వ.
కిన్నర లిట్లనిరి.
7-336-క.
ర్మము దలఁపడు లఘుతర
ర్మము చేయించు మమ్ముఁ లుషాత్మకు దు
ష్కర్మునిఁ జంపితి; వున్నత
ర్ములమై నీదు భక్తి లిపెదము హరీ!
టీకా:
          కిన్నరలు = కిన్నరలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          ధర్మమున్ = న్యాయమును; తలపడు = విచారింపడు; లఘుతర = మిక్కలి నీచపు {లఘు - లఘుతర - లఘుతమ}; కర్మము = పనులను; చేయించున్ = చేయించును; మమ్మున్ = మమ్ములను; కలుషాత్మకున్ = పాపాత్ముని; దుష్కర్మునిన్ = క్రూరకర్ముని; చంపితి = సంహరించితివి; ఉన్నత = గొప్ప; శర్ములము = సుఖముగలవారము; ఐ = అయ్యి; నీదు = నీ యొక్క; భక్తిన్ = భక్తిని; సలిపెదము = చేసెదము; హరీ = నరసింహుడా.
భావము:
            అశ్వముఖమూ నరశరీరమూ కలవారు, దేవతాభేదమూ అయిన కిన్నరులు ఇలా విన్నవించుకున్నారు.
            ఓ విష్ణుదేవా! ఈ హిరణ్యకశిప రాక్షసుడు ధర్మం తెలియని వాడు. మా చేత హీనమైన కార్యాలు చేయించేవాడు. అలాంటి దుర్మార్గుడిని సంహరించావు. ఇక సుఖజీవనులమై నిన్ను భక్తితో కొలుస్తాము.”
७-३३५-व.
किन्नर लिट्लनिरि.
टीका:
भावमु:
७-३३६-क.
धर्ममु दलँपडु लघुतर
कर्ममु चेयिंचु मम्मुँ गलुषात्मकु दु
ष्कर्मुनिँ जंपिति; वुन्नत
शर्मुलमै नीदु भक्ति सलिपेदमु हरी!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: