Wednesday, March 30, 2016

దేవతల నరసింహ స్తుతి - పురుషోత్తమ

7-331-వ.
కింపురుషు లిట్లనిరి.
7-332-క.
పురుషోత్తమ! నేరము కిం
పురుషుల మల్పులము నిన్ను భూషింపఁగ దు
ష్పురుషున్ సకల సుజన హృ
త్పరుషుం జంపితివి జగము బ్రదికె నధీశా!
టీకా:
          కింపురుషులు = కిపురుషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          పురుషోత్తమ = నరసింహుడా; నేరము = సమర్థులముకాము; కింపురుషులము = కింపురుషజాతి వారము; అల్పులము = చిన్నవారము; నిన్నున్ = నిన్ను; భూషింపగన్ = స్తుతించుటకు; దుష్పురుషున్ = చెడ్డవానిని; సకల = అఖిలమైన; సుజన = మంచివారి; హృత్ = హృదయములకు; పరుషున్ = కఠినుని; చంపితివి = సంహరించితివి; జగము = భువనము; బ్రతికెన్ = కాపాడబడినది; అధీశా = నరసింహుడా {అధీశ - సర్వజగత్తులకు అధి (పై) ఈశ (ప్రభువు), విష్ణువు}.
భావము:
            కింపురుషులు కీర్తిస్తూ ఇలా అన్నారు
            ఓ పురుషోత్తమా! పరమేశ! మేము కింపురుషులు అనే దేవతాభేదం వారం. నరముఖమూ అశ్వశరీరమూ కలవారం. అల్పులం. నీ మహాత్మ్యం కీర్తించడానికి మేము తగినవారం కాదు. శిష్టులైన వారి హృదయాలు గాయపడేలా బాధించేవాడు హిరణ్యకశిపుడు. ఆ దుష్టుడిని సంహరించావు. లోకమంతా బ్రతికిపోయింది.”
७-३३१-व.
किंपुरुषु लिट्लनिरि.
७-३३२-क.
पुरुषोत्तम! नेरमु किं
पुरुषुल मल्पुलमु निन्नु भूषिंपँग दु
ष्पुरुषुन् सकल सुजन हृ
त्परुषुं जंपितिवि जगमु ब्रदिके नधीशा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: