Wednesday, March 23, 2016

దేవతల నరసింహ స్తుతి - దానవుని

7-317-వ.
విద్యాధరు లిట్లనిరి.
7-318-క.
దావునిఁ జంపి యంత
ర్ధానాదికవిద్య లెల్ల యతో మరలం
గా నిచ్చితివి విచిత్రము
నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహా!
టీకా:
          విద్యాధరులు = విద్యాధరులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          దానవునిన్ = రాక్షసుని; చంపి = సంహరించి; అంతర్థాన = మాయమగుట; ఆది = మొదలగు; విద్యలు = విద్యలు; ఎల్లన్ = అన్నిటిని; దయ = కరుణ; తోన్ = తోటి; మరలంగన్ = మళ్ళీ; ఇచ్చితివి = ఇచ్చతివి; విచిత్రము = అద్భుతము; నీ = నీ యొక్క; నిరుపమ = సాటిలేని; వైభవంబు = ప్రభావము; నిజము = సత్యము; నృసింహా = నరసింహుడా.
భావము:
            విద్యాధరులు ఇలా వినుతులు పలికారు.
             ఓ నరకేసరీ! నీ వైభవం అతులితమూ, అసాధారణమూ. నీ చారిత్రము బహు విచిత్రము. హిరణ్యకశిప రాక్షసుడిని చంపి, అంతర్ధానం మున్నగు మా శక్తులు అన్నీ దయతో మాకు వెనక్కు ఇచ్చావు.”
७-३१७-व.
विद्याधरु लिट्लनिरि.
७-३१८-क.
दानवुनिँ जंपि यंत
र्धानादिकविद्य लेल्ल दयतो मरलं
गा निच्चितिवि विचित्रमु
नी निरुपम वैभवंबु निजमु नृसिंहा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: