Thursday, March 10, 2016

నృసింహరూపావిర్భావము – స్ఫురితవిబుధజన

7-298-క.
స్ఫురితవిబుధజన ముఖములు
రివిదళిత దనుజనివహతి తనుముఖముల్
గురురుచి జిత శిఖిశిఖములు
హరిఖరనఖము లమరు తజనసఖముల్.
టీకా:
స్పురిత = స్పారితమైన, వికసించినవైన; విబుధ = దేవతలైన; జన = వారి; ముఖములున్ = ముఖముగలవి; పరి = మిక్కలి; విదళిత = చీల్చబడిన; దనుజ = రాక్షస; నివహ = సమూహమునకు; పతి = ప్రభువు యొక్క; తను = దేహము; ముఖముల్ = ముఖములుగలవి; గురు = గొప్ప; రుచి = కాంతిచే; జిత = జయింపబడిన; శిఖి = అగ్ని; శిఖములున్ = జ్వాలలుగలది; నరహరి = నరసింహుని; ఖర = వాడియైన; నఖముల్ = గోళ్ళు; అమరు = చక్కనుండిన; నత = మ్రొక్కెడి; జన = వారియొక్క; సఖములు = హితములైనవి.
భావము:
నరసింహస్వామి గోళ్ళు శరణాగత సాధుజనులకు ఇష్టమైనవి. ఆ దానవేశ్వరుని దేహాన్ని చీల్చివేశాయి. దేవతల ముఖాలను వికసింపజేశాయి. బహు అధికమైన కాంతులతో అగ్నిశిఖలను సైతం ఓడించాయి.
సర్వలఘు కందంతో స్తోత్రం వాడిని వేడిని చూపుతోంది.
७-२९८-क.
स्फुरितविबुधजन मुखमुलु
परिविदळित दनुजनिवहपति तनुमुखमुल्
गुरुरुचि जित शिखिशिखमुलु
नरहरिखरनखमु लमरु नतजनसखमुल्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: