7-289-మ.
ప్రకటంబై
ప్రళయావసానమున మున్ బ్రహ్మాండభాండావరో
ధక మై
యున్న తమిస్రమున్ జగము నుత్పాదించుచోఁ
ద్రావి సా
త్త్విక తేజోనిధి
యైన విష్ణు నెడ నుద్దీపించునే? నష్టమై
వికలంబై
చెడుఁగాక తామసుల ప్రావీణ్యంబు
రాజోత్తమా!
టీకా:
ప్రకటంబు = బయల్పడినది; ఐ = అయ్యి; ప్రళయావసానమునన్ = ప్రళయాంతమునందు;
మున్ = పూర్వము; బ్రహ్మాండ
= బ్రహ్మాండముల; భాండ = భండాగారమునకు; అవరోధకము
= క్రమ్ముకొన్నది; ఐ = అయ్యి; ఉన్న
= ఉన్నట్టి; తమిశ్రమున్ = చీకటిని; జగమున్ = భువనము; ఉత్పాదించు = సృష్టించు; చోన్ = సమయమున; త్రావి = తాగి; సాత్త్విక = సత్త్వగుణసంబంధమైన; తేజస్ = తేజస్సునకు;
నిధి = నిధివంటివాడు; ఐన = అయిన; విష్ణున్ = హరి; ఎడన్ = అందు; ఉద్దీపించునే
= ప్రకాశించునా ఏమి; నష్టము = నశించినది; ఐ = అయిపోయి; వికలంబు = చెదిరిపోయినది; ఐ = అయ్యి; చెడుగాక = చెడిపోవును; తామసుల = తామసగుణముగలవారి; ప్రావీణ్యంబు = నేర్పులు;
రాజ = రాజుయైన; ఉత్తమా = ఉత్తముడా.
భావము:
ఓ ధర్మరాజా! పూర్వం ప్రళయకాలం అగుచున్నప్పుడు
ఈ బ్రహ్మాండం మొత్తాన్ని క్రమ్మి గాఢమైన చీకట్లు క్రమ్మి లోకం నాశనం
కాబోతున్నప్పుడు విష్ణువు ఆ అంధకారాన్ని ఆపోశన పట్టి తేజోమూర్తి అయ్యాడు. అటువంటి
శ్రీమహా విష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచలు అయిపోతుంది తప్ప ఏమాత్రం
ప్రకాశించ లేదు.
७-२८९-म.
प्रकटंबै प्रळयावसानमुन मुन् ब्रह्मांडभांडावरो
धक मै युन्न तमिस्रमुन् जगमु नुत्पादिंचुचोँ
द्रावि सा
त्त्विक तेजोनिधि यैन विष्णु नेड नुद्दीपिंचुने? नष्टमै
विकलंबै चेडुँगाक तामसुल प्रावीण्यंबु
राजोत्तमा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment