7-311-వ.
ఋషు లిట్లనిరి.
7-312-మ.
భవదీయాదరలీల
లోకముల నుత్పాదించి రక్షింప నేఁ
డవి దైత్యేశునిచేత
భేదితములై హ్రస్వంబులై
యుండ నీ
యవినీతున్
నరసింహరూపమున సంహారంబు
నొందించి వే
దవిధిం
గ్రమ్మఱ నుద్ధరించితి గదా ధర్మానుసంధాయివై.
టీకా:
ఋషులు =
ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి.

భావము:
మునీశ్వరులు ఇలా స్తోత్రాలు చేశారు.
“ఓ ధర్మసంస్థాపకా! ధర్మమూర్తీ! నీవు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి,
రక్షిస్తున్నావు. కానీ ఇవాళ రాక్షసుడు హిరణ్యకశిపుడు లోకలను ఛిన్నా
భిన్నం చేశాడు. ఈ దురహంకారిని నరకేసరిగా అవతరించి, సంహరించావు.
వేద ధర్మాన్ని మరల ఉద్ధరించావు.”
७-३११-व.
ऋषु लिट्लनिरि.
७-३१२-म.
भवदीयादरलील लोकमुल नुत्पादिंचि रक्षिंप नेँ
डवि दैत्येशुनिचेत भेदितमुलै ह्रस्वंबुलै युंड
नी
यविनीतुन् नरसिंहरूपमुन संहारंबु नोंदिंचि वे
दविधिं ग्रम्मर्र नुद्धरिंचिति गदा
धर्मानुसंधायिवै.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment