7-296-శా.
చించున్ హృత్కమలంబు, శోణితము వర్షించున్ ధరామండలిం,
ద్రెంచుం గర్కశనాడికావళులు, భేదించున్
మహావక్షముం,
ద్రుంచున్ మాంసము
సూక్ష్మఖండములుగా, దుష్టాసురున్
వ్రచ్చి ద
ర్పించుం, బ్రేవులు
కంఠమాలికలు గల్పించున్ నఖోద్భాసియై.
టీకా:

భావము:
దేవదేవుడు నరసింహ రూపుడు, దానవేశ్వరుడి
గుండెలు చీల్చి భూమి మీద నెత్తురు కురిపించాడు; కఠోరమైన
రక్తనాళాలు త్రెంచి తుత్తునియలు చేశాడు; కండరాలు ఖండించి
ముక్కలు ముక్కలుగా చేశాడు; రక్తం కారుతున్న ప్రేగులు లాగి తన
కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు. ఇలా అమితోత్సాహంతో హిరణ్యకశిపుని చంపి సంహరించి
నరసింహమూర్తి గోళ్ళ కాంతులతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు.
७-२९६-शा.
चिंचुन् हृत्कमलंबु, शोणितमु वर्षिंचुन् धरामंडलिं,
द्रेंचुं गर्कशनाडिकावळुलु, भेदिंचुन्
महावक्षमुं,
द्रुंचुन् मांसमु सूक्ष्मखंडमुलुगा, दुष्टासुरुन् व्रच्चि द
र्पिंचुं, ब्रेवुलु कंठमालिकलु गल्पिंचुन् नखोद्भासियै.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment