7-303-వ.
మఱియు నయ్యవసరంబున మింట ననేక దేవతావిమానంబులును
గంధర్వగానంబులును, నప్సరోగణ నర్తన సంవిధానంబులును, దివ్యకాహళ భేరీ పటహ మురజాది ధ్వానంబులును బ్రకాశమానంబు లయ్యె; సునందకుముదాదులయిన హరిపార్శ్వచరులును, విరించి
మహేశ్వర మహేంద్ర పురస్సరులగు త్రిదశ కిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ
గంధర్వ చారణ విద్యాధరాదులును, ప్రజాపతులును, నరకంఠీరవ దర్శనోత్కంఠు లయి చనుదెంచి.
టీకా:
మఱియున్ = ఇంకను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; మింటన్
= ఆకాశమున; అనేక = పలు; దేవతా = దేవతల;
విమానంబులును = విమానములు; గంధర్వ = గంధర్వుల;
గానంబులును = పాటలును; అప్సరస్ = అప్సరసల;
గణ = సమూహముయొక్క; నర్తన = ఆటల; సంవిధానంబులును = తీరులును; దివ్య = దివ్యమైన;
కాహళ = బాకాలు; భేరీ = భేరీలు; పటహ = తప్పెటలు; మురజ = మద్దెలలు; ఆది = మొదలగు; ధ్వానంబులునున్
= శబ్దములు; ప్రకాశమానంబులు = ప్రకాశించునవి; అయ్యెన్ = అయ్యెను; సునంద =
సునందుడు; కుముద = కుముదుడు; ఆదులు =
మొదలగువారు; అయిన = ఐన; హరి = విష్ణుని;
పార్శ్వచరులును = పరిచారకులు; విరించి =
బ్రహ్మదేవుడు {విరించి - భూతములను
పుట్టించువాడు, బ్రహ్మ}; మహేశ్వర =
పరమశివుడు; మహేంద్ర = ఇంద్రుడు; పురస్సరులు
= మొదలగుముఖ్యులు; అగు = అయిన; త్రిదశ
= దేవతలు; కిన్నర = కిన్నరలు; కింపురుష
= కింపురుషులు; పన్నగ = సర్పములు; సిద్ధ
= సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గరుడ =
గరుడులు; గంధర్వ = గంధర్వులు; చారణ =
చారణులు; విద్యాధర = విద్యాధరులు; ఆదులును
= మొదలగువారు; ప్రజాపతులును = ప్రజాపతులు; నరకంఠీరవ = నరసింహుని; దర్శన = చూడవలెనని; ఉత్కంఠులు = వేడుకగలవారు; అయి = అయ్యి; చనుదెంచి = వచ్చి.
భావము:
ఆ సమయంలో ఆకాశంలో అనేకమైన దేవతా
విమానాలు తిరిగాయి; గంధర్వ
గానాలు వీనుల విందు చేశాయి; అప్సరసల నాట్యాలు కన్నుల పండువు
చేశాయి; దివ్యమైన కాహళ, భేరీ, మురజ మున్నగు మంగళవాద్యాలు అనేకం వినబడ్డాయి; సునందుడు,
కుముదుడు మొదలైన దేవతలు శ్రీహరి పార్శ్వచరులు; పరమేశ్వరుడూ, బ్రహ్మదేవుడూ, మహేంద్రుడూ,
మొదలైన దేవతలూ; కిన్నరులూ; కింపురుషులూ; నాగులూ; సిద్ధులూ;
సాధ్యులూ; గరుడులూ; గంధర్వులూ;
చారణులూ; విద్యాధరులూ; ప్రజాపతులూ
అందరూ ఆ ఉగ్ర నరకేసరిని దర్శించాలనే కుతూహలంతో విచ్చేశారు.
७-३०३-व.
मर्रियु नय्यवसरंबुन मिंट ननेक देवताविमानंबुलुनु
गंधर्वगानंबुलुनु, नप्सरोगण नर्तन संविधानंबुलुनु, दिव्यकाहळ भेरी पटह मुरजादि ध्वानंबुलुनु ब्रकाशमानंबु लय्ये; सुनंदकुमुदादुलयिन हरिपार्श्वचरुलुनु, विरिंचि महेश्वर महेंद्र पुरस्सरुलगु त्रिदश किन्नर
किंपुरुष पन्नग सिद्ध साध्य गरुड गंधर्व चारण विद्याधरादुलुनु, प्रजापतुलुनु, नरकंठीरव दर्शनोत्कंठु लयि चनुदेंचि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment