Saturday, March 19, 2016

దేవతల నరసింహ స్తుతి - ప్రాణిసంఘముల

7-309-వ.
ఇంద్రుం డిట్లనియె.
7-310-సీ.
ప్రాణిసంఘముల హృత్పద్మమధ్యంబుల; నివసించి భాసిల్లు నీవ యెఱుఁగు
దింతకాలము దానవేశ్వరుచే బాధడి చిక్కి యున్న యాన్నజనుల
క్షించితివి మమ్మురాక్షసుఁ జంపితిక్రతుహవ్యములు మాకుఁ లిగె మరల; మంటిమి; నీ సేవ రిగిన వారలుకైవల్య విభవంబు కాంక్ష చేయ
7-310.1-ఆ.
రితరసుఖము లెల్ల నిచ్ఛగింపఁగ నేల?; స్థిరంబులివి, నంతభక్తిఁ;
గొలువ నిమ్ము నిన్ను ఘోరదైత్యానీక; చిత్తభయదరంహ! శ్రీనృసింహ!
టీకా:
          ఇంద్రుండు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          ప్రాణి = జీవ; సంఘముల = కోటి యొక్క; హృత్ = హృదయములనెడి; పద్మ = పద్మముల; మధ్యంబులన్ = నడిమియందు; నివసించి = ఉండి; భాసిల్లు = ప్రకాశించెడి; నీవ = నీవే; ఎఱుంగుదు = తెలిసి యుందువు; ఇంత = ఇంత; కాలము = కాలము; దానవ = రాక్షసుల; ఈశ్వరు = రాజు; చేన్ = వలన; బాధ = బాధలందు; పడి = పడి; చిక్కి = నీరసించి; ఉన్న = ఉన్నట్టి; ఆపన్న = అపాయములపడిన; జనులన్ = వారలను; రక్షించితివి = కాపాడితివి; మమ్మున్ = మమ్ము; రాక్షసున్ = రాక్షసుని; చంపితి = చంపితివి; క్రతు = యజ్ఞములందలి; హవ్యములున్ = హవిర్భాగములు; మా = మా; కున్ = కు; కలిగె = లభించినవి; మరలన్ = మరల; మంటిమి = బతికితిమి; నీ = నీ యొక్క; సేవన్ = భక్తిని; మరిగిన = మరలుగొనిన, మోహపడిన; వారలు = వారు; కైవల్య = ముక్తిపదము యొక్క; విభవంబున్ = వైభవమును కూడ; కాంక్షచేయరు = కోరరు; ఇతర = మిగిలిన. 
సుఖముల్ = సుఖములను; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చగింపన్ = కోరుట; ఏల = ఎందులకు; అస్థిరంబులు = చపలములు; ఇవి = ఇవి; అనంత = తెంపులేని; భక్తిన్ = భక్తితో; కొలువనిమ్ము = సేవించనిమ్ము; నిన్నున్ = నిన్ను; ఘోర = భయంకరమైన; దైత్య = రాక్షస; అనీక = సేనల; చిత్త = మనసులందు; భయద = భయముపుట్టించెడి; రంహ = సంరంభముగలవాడ; శ్రీ = శుభకరమైన; నృసింహ = నరసింహుడా.
భావము:
            ఇంద్రుడు ఇలా సన్నుతించాడు
            “అరి వీర భయంకర స్పూర్తీ! నరసింహమూర్తీ! నీవు భీకర ప్రవృత్తి గల రాక్షసులు అందరి మనసులలోనూ భయము రేకెత్తించే వాడవు. సమస్త ప్రాణుల హృదయ పద్మాలలోనూ ప్రకాశించు వాడవు. నీకు తెలియనిది ఏమున్నది. ఇంతకాలం ఈ రాక్షసుల ప్రభువు అయిన హిరణ్యకశిపుని వలన కష్టాలు అనుభవించి ఆర్తులం అయ్యాము. నీవు ఆ రాక్షసుని సంహరించి మమ్ములను రక్షించావు. మాకు మరల మా హవిర్భాగాలు దక్కాయి. మా బ్రతుకులు వన్నెకెక్కాయి. నీ సేవా భాగ్యం పొందిన వారు కైవల్యాన్ని కూడా కోరుకోరు. అటువంటిది అశాశ్వతాలైన ఇతర కోరికలు కోరుకోటం ఎందుకూ, దండగ. అపారమైన భక్తితో నిన్ను సేవించుకునే వరం ప్రసాదించు నరకేసరీ!”
७-३०९-व.
इंद्रुं डिट्लनिये.
७-३१०-सी.
प्राणिसंघमुल हृत्पद्ममध्यंबुल; निवसिंचि भासिल्लु नीव येर्रुँगु;
दिंतकालमु दानवेश्वरुचे बाध; पडि चिक्कि युन्न यापन्नजनुल
रक्षिंचितिवि मम्मु; राक्षसुँ जंपिति; क्रतुहव्यमुलु माकुँ गलिगे मरल; मंटिमि; नी सेव मरिगिन वारलु; कैवल्य विभवंबु कांक्ष चय
७-३१०.१-आ.
रितरसुखमु लेल्ल निच्छगिंपँग नेल?; यस्थिरंबुलिवि, यनंतभक्तिँ;
गोलुव निम्मु निन्नु घोरदैत्यानीक; चित्तभयदरंह! श्रीनृसिंह!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: