Thursday, March 24, 2016

దేవతల నరసింహ స్తుతి - రత్నములను

7-319-వ.
భుజంగు లిట్లనిరి.
7-320-క.
త్నములను మత్కాంతా
త్నంబుల బుచ్చికొన్న క్కసు నురమున్
త్నమున వ్రచ్చి వైచితి
త్నులు రత్నములుఁ గలిగి బ్రతికితి మీశా!
టీకా:
          భుజంగులు = సర్పముల; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          రత్నములను = రత్నములను; మత్ = మా యొక్క; కాంతా = స్త్రీ, భార్యా; రత్నంబులన్ = రత్నములను; పుచ్చికొన్న = తీసుకొన్న; రక్కసున్ = రాక్షసుని; ఉరమున్ = వక్షస్థలమును; యత్నమునన్ = పూని; వ్రచ్చివైచితివి = చీల్చివేసితివి; పత్నులున్ = భార్యలను; రత్నములున్ = మణులు; కలిగి = పొంది; బ్రతికితిమి = బతికిపోతిమి; ఈశా = నరసింహా.
భావము:
            నాగేంద్రులు ఇలా నతులు పలికారు.
             ఓ దేవా! ఈశ్వరా! హిరణ్యకశిపుడు మా శిరోరత్నాలను, స్త్రీరత్నాలను లాక్కున్నాడు. ఆ రాక్షసుడి వక్షస్థలం వ్రక్కలుచేసి. ఓడించి, సంహరించావు. మా మణులూ, రమణులూ తిరిగి లభించేలా చేసి మమ్ము కాపాడావు.”
७-३१९-व.
भुजंगु लिट्लनिरि.
७-३२०-क.
रत्नमुलनु मत्कांता
रत्नंबुल बुच्चिकोन्न रक्कसु नुरमुन्
यत्नमुन व्रच्चि वैचिति;
पत्नुलु रत्नमुलुँ गलिगि ब्रतिकिति मीशा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: