7-294-వ.
అంత.
7-295-మ.
విహగేంద్రుం
డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్
నృసింహుండు సా
గ్రహుఁడై
యూరువులందుఁ జేర్చి నఖసంఘాతంబులన్
వ్రచ్చె దు
స్సహు దంభోళికఠోరదేహు
నచలోత్సాహున్ మహాబాహు నిం
ద్ర హుతాశాంతకభీకరున్
ఘనకరున్ దైత్యాన్వయ
శ్రీకరున్.
టీకా:
విహంగేంద్రుండు = గరుత్మంతుడు; అహి = పామును; వ్రచ్చు = చీల్చెడి; కైవడి = లాగున; మహా = మిక్కిలి; ఉద్వృత్తిన్ = అతిశయముతో; నృసింహుండు = నరసింహుడు;
సాగ్రహుడు = క్రోధముతోకూడినవాడు; ఐ = అయ్యి;
ఊరువులు = తొడల; అందున్ = మీద; చేర్చి = చేర్చుకొని; నఖ = గోళ్ళ; సంఘాతంబులన్ = పోటులచేత; వ్రచ్చెన్ = చీల్చెను;
దుస్సహున్ = (పరాక్రమముచే)ఓర్వరానివాని; దంభోళి
= వజ్రాయుధములాంటి; కఠోర = కఠినమైన; దేహున్
= దేహముగలవానిని; అచల = చలించని; ఉత్సాహున్
= పూనికగలవానిని; మహా = గొప్ప; బాహున్
= భుజబలుని; ఇంద్ర = ఇంద్రుడు; హుతాశ =
అగ్ని {హుతాశనుడు - హుత (హోమద్రవ్యము) అశనుడు (తినువాడు),
అగ్ని}; అంతక = యములకు {శాంతకుడు
- శమింపజేయువాడు, యముడు}; భీరున్ =
భయము పుట్టించు వానిని; ఘన = బలిష్టమైన; కరున్ = చేతులుగలవానిని; దైత్య = రాక్షస; అన్వయ = వంశమునకు; శ్రీకరున్ = వన్నెకలిగించువానిని.
అంత = అంతట.
భావము:
అప్పుడు, గరుత్మంతుడు పాములను పట్టుకుని చీల్చే విధంగా, నృసింహావతారుడు
ఆగ్రహంతో వజ్రకఠోరకాయుడూ; అచంచల ఉత్సాహవంతుడూ; మహాబాహుడూ; ఇంద్ర అగ్ని యమాదులకు మిక్కిలి భయం
పుట్టించేవాడూ; దానవవంశ శుభంకరుడూ; దుస్సహ
పరాక్రమం గలవాడూ అయిన హిరణ్యకశిపుడిని పట్టుకుని బలవంతంగా తన తొడలపై అడ్డంగా
పడేసుకొన్నాడు. వాడి రొమ్ము తన వాడి గోళ్ళతో చీల్చాడు. అంతట
७-२९५-म.
विहगेंद्रुं डहि व्रच्चुकैवडि महोद्वृत्तिन् नृसिंहुंडु सा
ग्रहुँडै यूरुवुलंदुँ जेर्चि नखसंघातंबुलन् व्रच्चे दु
स्सहु दंभोळिकठोरदहु नचलोत्साहुन् महाबाहु निं
द्र हुताशांतकभीकरुन् घनकरुन् दैत्यान्वय श्रीकरुन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment