Thursday, March 31, 2016

దేవతల నరసింహ స్తుతి - త్రిభువనశత్రుఁడు


7-333-వ.
వైతాళికు లిట్లనిరి.
7-334-క.
త్రిభువనశత్రుఁడు పడియెను
లందును మఖము లందు గదీశ్వర! నీ
శుగీతములు పఠించుచు
యులమై సంచరింతు మార్తశరణ్యా!
టీకా:
          వైతాళికులు = మేలుకొలుపు పాడు వారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          త్రిభువన = ముల్లోకములకు; శత్రుడు = శత్రువు; పడియెన్ = చనిపోయెను; సభలు = సభలు; అందును = లోను; మఖములు = యజ్ఞములు; అందున్ = లోను; జగదీశ్వర = నరసింహుడా {జగదీశ్వరుడు - జగత్ (భువనములకు) ఈశ్వరుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; శుభ = మంగళ; గీతములున్ = స్తోత్రములను; పఠించుచున్ = పాడుచు; అభయులము = భయములేనివారము; ఐ = అయ్యి; సంచరింతుము = తిరిగెదము; ఆర్తశరణ్య = నరసింహుడా {ఆర్తశరణ్యుడు - ఆర్తులైనవారికి శరణు యిచ్చువాడు, విష్ణువు}.
భావము:
            మేలుకొలుపులు పాడే వైతాళికులు ఇలా స్తుతించారు
            ఓ సకల భువన పాలకా! నరకేసరి! నీవు ఆర్తులకు శరణు ఇచ్చువాడవు. ముల్లోకాలకూ శత్రువు అయిన హిరణ్యకశిపుడు మరణించాడు. ఇంక యజ్ఞశాలలలోనూ, సభావేదికలమీదా నీ వీరగాథలు, యశోగీతాలు గానం చేస్తాం. నిర్భయంగా మా కర్తవ్యం మేము నిర్వహిస్తాము.”
७-३३३-व.
वैताळिकु लिट्लनिरि.
७-३३४-क.
त्रिभुवनशत्रुँडु पडियेनु
सभलंदुनु मखमु लंदु जगदीश्वर! नी
शुभगीतमुलु पठिंचुचु
नभयुलमै संचरिंतु मार्तशरण्या!

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, March 30, 2016

దేవతల నరసింహ స్తుతి - పురుషోత్తమ

7-331-వ.
కింపురుషు లిట్లనిరి.
7-332-క.
పురుషోత్తమ! నేరము కిం
పురుషుల మల్పులము నిన్ను భూషింపఁగ దు
ష్పురుషున్ సకల సుజన హృ
త్పరుషుం జంపితివి జగము బ్రదికె నధీశా!
టీకా:
          కింపురుషులు = కిపురుషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          పురుషోత్తమ = నరసింహుడా; నేరము = సమర్థులముకాము; కింపురుషులము = కింపురుషజాతి వారము; అల్పులము = చిన్నవారము; నిన్నున్ = నిన్ను; భూషింపగన్ = స్తుతించుటకు; దుష్పురుషున్ = చెడ్డవానిని; సకల = అఖిలమైన; సుజన = మంచివారి; హృత్ = హృదయములకు; పరుషున్ = కఠినుని; చంపితివి = సంహరించితివి; జగము = భువనము; బ్రతికెన్ = కాపాడబడినది; అధీశా = నరసింహుడా {అధీశ - సర్వజగత్తులకు అధి (పై) ఈశ (ప్రభువు), విష్ణువు}.
భావము:
            కింపురుషులు కీర్తిస్తూ ఇలా అన్నారు
            ఓ పురుషోత్తమా! పరమేశ! మేము కింపురుషులు అనే దేవతాభేదం వారం. నరముఖమూ అశ్వశరీరమూ కలవారం. అల్పులం. నీ మహాత్మ్యం కీర్తించడానికి మేము తగినవారం కాదు. శిష్టులైన వారి హృదయాలు గాయపడేలా బాధించేవాడు హిరణ్యకశిపుడు. ఆ దుష్టుడిని సంహరించావు. లోకమంతా బ్రతికిపోయింది.”
७-३३१-व.
किंपुरुषु लिट्लनिरि.
७-३३२-क.
पुरुषोत्तम! नेरमु किं
पुरुषुल मल्पुलमु निन्नु भूषिंपँग दु
ष्पुरुषुन् सकल सुजन हृ
त्परुषुं जंपितिवि जगमु ब्रदिके नधीशा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, March 29, 2016

దేవతల నరసింహ స్తుతి - భ్రంశము లేని

7-329-వ.
యక్షు లిట్లనిరి.
7-330-ఉ.
భ్రంము లేని నీ భటుల భంగవిముక్తుల మమ్ము నెక్కి ని
స్సంయవృత్తి దిక్కులఁ బ్రచారము చేయుచు నుండు వీఁడు ని
స్త్రింముతోడ; వీనిఁ గడతేర్చితి వాపద మానె నో! చతు
ర్వింతితత్త్వశాసక! త్రివిష్టపముఖ్యజగన్నివాసకా!
టీకా:
          యక్షులు = యక్షులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          భ్రంశము = కలత; లేని = లేనట్టి; నీ = నీ యొక్క; భటులన్ = కింకరులము; భంగవిముక్తులము = పరాభవములేనివారము; మమ్మున్ = మమ్ములను; ఎక్కి = అధిరోహించి; నిస్సంశయ = సంశయమేమిలేని; వృత్తిన్ = విధముగ; దిక్కులన్ = అన్నివైపులకు; ప్రచారము = అధికముగ చరించుట; చేయుచునుండు = చేయుచుండు; వీడు = ఇతడు; నిస్త్రింశము = గోర్లు {నిస్త్రింశము - ముప్పది మానములకంటె పెద్దవి, నరహరి గోర్లు}; తోడన్ = తోటి; వీనిన్ = ఇతనిని; కడతేర్చితివి = చంపితివి {కడతేర్చు - (జీవితము) కడ (చివరకు) చేర్చు, చంపు}; ఆపద = కష్టము; మానెను = తప్పినది {త్రివిష్టపము - (ముల్లోకములు భూర్భువస్సువర్లోకములలోని) త్రి (మూడవ 3) విష్టపము (లోకము), స్వర్గము}; ఓ = ఓ {చతుర్వింశతితత్త్వములు -దశేంద్రియములు (10) విషయ పంచకము (5) భూత పంచకము (5) అంతఃకరణ చతుష్టయము}; చతుర్వింశతితత్త్వశాసక = నరసింహుడా {చతుర్వింశతితత్త్వశాసకుడు - 24 తత్త్వములను పాలించెడివాడు, విష్ణువు}; త్రివిష్టపముఖ్యజగన్నివాసకా = నరసింహుడా {త్రివిష్టపముఖ్యజగన్నివాసకుడు - త్రివిష్టప (స్వర్గము) మొదలగు జగత్ (లోకములలో) నివాసకా (వసించెడివాడు), విష్ణువు}.
భావము:
            యక్షులు ఈ విధంగా అన్నారు.
            ఓ నరసింహస్వామీ! నీవు ఇరవైనాలుగు తత్వాలను ప్రవర్తింపజేసే వాడవు. త్రివిష్టప వాసులైన దేవత లందరికి ఉన్నతుడవు. జగత్తంతా నిండి ఆత్మ రూపంలో వసించి ఉండే వాసుదేవుడవు. ఈ దానవేశ్వరుడు అయ్యో పాపం అనికూడా అనుకోకుండా, మా భుజాల మీద ఎక్కి నల్దిక్కులా తిరుగుతుండే వాడు. ఆ హిరణ్యకశిపుడుని వధించావు. మా కష్టాలు కడతేర్చావు.”
७-३२९-व.
यक्षु लिट्लनिरि.
टीका:
भावमु:
७-३३०-उ.
भ्रंशमु लेनि नी भटुल भंगविमुक्तुल मम्मु नेक्कि नि
स्संशयवृत्ति दिक्कुलँ ब्रचारमु चेयुचु नुंडु वीँडु नि
स्त्रिंशमुतोड; वीनिँ गडतेर्चिति वापद माने नो! चतु
र्विंशतितत्त्वशासक! त्रिविष्टपमुख्यजगन्निवासका!

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, March 28, 2016

దేవతల నరసింహ స్తుతి - భువనజన

7-327-వ.
చారణు లిట్లనిరి.
7-328-క.
భునజన హృదయభల్లుఁడు
దివిజేంద్ర విరోధి నేఁడు దెగె నీ చేతన్
రోగ నివర్తక మగు
దంఘ్రి యుగంబుఁ జేరి బ్రదికెద మీశా!
టీకా:
          చారణులు = చారణులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          భువన = జగత్తునందలి; జన = జనుల యొక్క; హృదయ = హృదయములకు; భల్లుడు = బల్లెమువంటివాడు; దివిజేంద్ర = ఇంద్రుని {దివిజేంద్రుడు - దివిజ (దేవత)లకు ఇంద్రుడు, దేవేంద్రుడు}; విరోధి = శత్రువు; నేడు = ఈ దినమున; తెగెన్ = మరణించెను; నీ = నీ; చేతన్ = వలన; భవ = సంసారము యనెడి; రోగ = రోగమును; నివర్తకము = పోగొట్టునది; అగు = అయిన; భవత్ = నీ యొక్క; అంఘ్రి = పాదముల; యుగంబున్ = జంటను; చేరి = చేరి; బ్రదికెదము = బతికెదము; ఈశా = నరసింహుడా.
భావము:
            చారణులు ఇలా అన్నారు.
            ఓ నరకేసరీ! సర్వలోకేశ్వరా! హిరణ్యకశిపుడు ప్రజా హృదయ కంటకుడు. దేవేంద్రుని బద్దశత్రువూ. రాత్రించరులైన రాక్షస జాతికి చెందినవాడు నీ చేతిలో మరణించాడు, మా కష్టాలు గట్టెక్కాయి. ఇంక సంసార బంధాలనుండి విముక్తి నొసంగే నీ పాదపద్మాలను ఆశ్రయించి బ్రతుకుతాము.”
७-३२७-व.
चारणु लिट्लनिरि.
७-३२८-क.
भुवनजन हृदयभल्लुँडु
दिविजेंद्र विरोधि नएँडु देगे नी चेतन्
भवरोग निवर्तक मगु
भवदंघ्रि युगंबुँ जेरि ब्रदिकेद मीशा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, March 27, 2016

దేవతల నరసింహ స్తుతి - ఆడుదుము

7-325-వ.
గంధర్వు లిట్లనిరి.
7-326-క.
డుదుము రేయుఁబగలుం
బాడుదుము నిశాటు నొద్దబాధించు దయం
జూడఁడు నీచే జమునిం
గూడె మహాపాతకునకుఁ గుశలము గలదే.
టీకా:
          గంధర్వులు = గంధర్వులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          ఆడుదుము = నాట్యముచేసెదము; రేయున్ = రాత్రులందు; పగలున్ = పగళ్ళయందు; పాడుదుము = పాడెదము; నిశాటున్ = రాక్షసుని {నిశాటుడు - రాత్రించరుడు, రాక్షసుడు}; ఒద్దన్ = దగ్గర; బాధించున్ = బాధపెట్టును; దయన్ = కరుణతో; చూడడు = చూడడు; నీ = నీ; చేన్ = చేత; జమునిగూడెన్ = చనిపోయెను {జమునిగూడు - జముని (యముని) కూడు (కలియు), మరణించు}; మహా = అతి; పాతకున్ = తీవ్రమైనపాపములుగలవాని; కున్ = కు; కుశలము = క్షేమము; కలదే = ఉండునా ఏమి.
భావము:
            గంధర్వులు ఇలా అంటూ గానాలు చేసారు.
            ప్రభూ! రాత్రిం బవళ్ళు ఈ రాక్షసుడి సమక్షంలో గానం చేసేవాళ్ళం; నాట్యం చేసే వాళ్ళం; అయినా మమ్మల్ని ఎంతో హీనంగా చూసి బాధించేవాడు; ఏనాడూ దయగా చూడలేదు. వీడిలాంటి మహాపాపిష్టి వానికి మంగళం ఎలా కలుగుతుందా? చివరికి నీ వల్ల యమపురికి పోయాడు”
७-३२५-व.
गंधर्वु लिट्लनिरि.
७-३२६-क.
आडुदुमु रेयुँबगलुं
बाडुदुमु निशाटु नोद्द, बाधिंचु दयं
जूडँडु नीचे जमुनिं
गूडे महापातकुनकुँ गुशलमु गलदे.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, March 26, 2016

దేవతల నరసింహ స్తుతి - ప్రజలం

7-323-వ.
ప్రజాపతు లిట్లనిరి.
7-324-మ.
ప్రలం జేయుటకై సృజించితి మముం బాటించి; దైత్యాజ్ఞచేఁ
బ్రలం జేయక యింతకాలము మహాభారంబుతో నుంటి; మీ
కునున్ వక్షముఁ జీరి చంపితివి; సంకోచంబు లే కెల్ల చోఁ
బ్రలం జేయుచు నుండువారము జగద్భద్రాయమాణోదయా!
టీకా:
          ప్రజాపతులు = ప్రజాపతులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          ప్రజలన్ = లోకులను; చేయుట = పుట్టించుట; కై = కోసము; సృజించితి = పుట్టించితి; మమున్ = మమ్ములను; పాటించి = పూని; దైత్య = రాక్షసుని; ఆజ్ఞ = ఉత్తరువుల; చేత = వలన; ప్రజలన్ = లోకులను; చేయక = పుట్టించకుండగ; ఇంత = ఇన్ని; కాలమున్ = దినములు; మహా = గొప్ప; భారంబు = దుఃఖభారము; తోన్ = తోటి; ఉంటిమి = ఉన్నాము; ఈ = ఈ; కుజనున్ = దుర్జనుని; వక్షమున్ = రొమ్మును; చీరి = చీల్చివేసి; చంపితివి = సంహరించితివి; సంకోచంబుల్ = అనుమానములు; లేకన్ = లేకుండగ; ఎల్ల = అన్ని; చోన్ = చోటులందు; ప్రజలన్ = లోకులను; చేయుచున్ = చేయుచు; ఉండువారము = ఉంటాము; జగత్ = లోకములను; భద్రాయమాణ = క్షేమకరమగుటకు; ఉదయా = అవతరించినవాడ.
భావము:
            ప్రజాపతులు ప్రస్తుతిస్తూ ఇలా అన్నారు.
            ఓ నరకేసరీ! జగత్తులకు మేలు చేయుటకు అవతరించిన ప్రభువా! జగద్రక్షకా! మమ్మల్ని ప్రజాసృష్టి చేయటం కోసమే సృష్టించావు. కానీ ఈ రాక్షసుడి ఆజ్ఞ మూలాన ఆ ప్రజాసృష్టినే మానేయవలసి వచ్చింది. ప్రజా వ్యవస్థకు దురవస్థ దాపురించింది. ఆ దుర్మతి హిరణ్యకశిపుని గుండెలు చీల్చి చంపావు. ఇంక ఏ సంకోచమూ లేకుండా ప్రజాసృష్టి చేస్తుంటాము.”
७-३२३-व.
प्रजापतु लिट्लनिरि.
७-३२४-म.
प्रजलं जेयुटकै सृजिंचिति ममुं बाटिंचि; दैत्याज्ञचेँ
ब्रजलं जेयक यिंतकालमु महाभारंबुतो नुंटि; मी
कुजनुन् वक्षमुँ जीरि चंपितिवि; संकोचंबु ले केल्ल चोँ
ब्रजलं जेयुचु नुंडुवारमु जगद्भद्रायमाणोदया!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :