7-74-వచనము
ఇట్లు త్రైలోక్యసంతాపకరంబైన
దైత్యరాజతపోవిజృంభణంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకంబునకుం జని
లోకేశ్వరుండయిన బ్రహ్మకు వినతులయి యిట్లని విన్నవించిరి.
రాక్షసరాజు హిరణ్యకశిపుడి
తపస్సు తీవ్రత వలన ఇలా ముల్లోకాలలోనూ తాపం చెలరేగుతోంది. ఆ తాపాన్ని తట్టుకోలేక
దేవతలు స్వర్గలోకం నుండి బయలుదేరి బ్రహ్మ ఉండే సత్యలోకానికి వెళ్ళారు.
లోకాలన్నిటికి ప్రభువైన బ్రహ్మదేవుడికి నమస్కరించి, ఇలా తమ బాధలు చెప్పుకోసాగారు.
७-७४-वचनमु
इट्लु
त्रैलोक्यसंतापकरंबैन दैत्यराजतपोविजृंभणंबु सैरिंपक निलिंपुलु नाकंबु विडिचि
ब्रह्मलोकंबुनकुं जनि लोकेश्वरुंडयिन ब्रह्मकु विनतुलयि यिट्लनि विन्नविंचिरि.
ఇట్లు = ఈ విధముగ; త్రైలోక్య = ముల్లోకములకు {ముల్లోకములు
- 1భూలోకము
2స్వర్గలోకము 3నరకలోకము}; సంతాప = మిక్కలి తాపము; కరంబు = కలిగించెడిది; ఐన = అయిన; దైత్య = రాక్షసులకు; రాజ = రాజు యొక్క; తపస్ = తపస్సు; విజృంభణంబున్ = పెంపును; సైరింపన్ = ఓర్చుకొన; చాలక = లేక; నిలింపులు = దేవతలు; నాకంబున్ = స్వర్గమును; విడిచి = వదలివేసి; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; చని = వెళ్ళి; లోక = ఎల్లలోకములకు; ఈశ్వరుండు = ప్రభువు; అయిన = ఐనట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; వినతులు = మ్రొక్కినవారు; అయి = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; విన్నవించిరి = మనవిచేసుకొనిరి.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment