7-34-సీస పద్యము
పొండు దానవులార! భూసురక్షేత్ర సం; గతయైన భూమికి గములు గట్టి
మఖతపస్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల; వెదకి ఖండింపుఁడు విష్ణుఁ డనఁగ
నన్యుఁ డొక్కఁడు
లేఁడు యజ్ఞంబు వేదంబు; నతఁడె భూదేవ క్రి
యాదిమూల
మతఁడు దేవర్షి పిత్రాదిలోకములకు; ధర్మాదులకు మహాధార మతఁడె
7-34.1-తేటగీతి
యే స్థలంబుల గో
భూసురేంద్ర వేద; వర్ణధర్మాశ్రమంబులు
వరుస నుండు
నా స్థలంబుల కెల్ల
మీ రరిగి చెఱచి; దగ్ధములు జేసి
రండు మీ దర్ప మొప్ప.
ఓ దానవ శ్రేష్ఠులారా! బయలుదేరండి. ముందుగా బ్రాహ్మణులు
ఉండే ప్రదేశాలకు గుంపులు గుంపులుగా వెళ్ళండి; యజ్లాలు,
జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రతాలూ, వాటిని చేసే విప్రులనూ, మౌన వ్రతాలు చేసే మునులనూ
వెదికి మరీ నాశనం చేయండి; విష్ణుడు అంటూ ఎక్కడా వేరే ఎవడూ
లేడు; యజ్మమే అతడు, వేదాలే అతడు, బ్రాహ్మణ వైదిక కర్మలే అతడు, జపతపాలే అతడు; సర్వ దేవతా సమూహాలకూ, ముని సంఘాలకూ, పైతృక లోకాలకూ, సర్వధర్మాలకూ అతడే
మూలం ఆధారం; ఎక్కడైతే గోవులూ, బ్రాహ్మణులూ సుఖంగా
జీవిస్తుంటారో; ఎక్కడైతే వైదిక ధర్మాలూ, ఆశ్రమాలూ చక్కగా
నడుస్తూ ఉంటాయో; ఆయా చోట్లన్నిటికీ వెళ్ళి వాటిని ధ్వంసం
చేయండి; మీ గర్వం, దర్పం శోభించేలా వాటన్నిటినీ దగ్ధం
చేసేయండి.” అని హిరణ్యకశిపుడు రాక్షస వీరులను ఆజ్ఞాపించాడు.
७-३४-सीस पद्यमु
पोंडु दानवुलार! भूसुरक्षॅत्र सं; गतयैन भूमिकि गमुलु गट्टि
मखतपस्स्वाध्याय मौनव्रतस्थुल; वेदकि खंडिंपुँडु विष्णुँ डनँग
नन्युँ डोक्कँडु लॅँडु यज्ञंबु वॅदंबु; नतँडे भूदॅव क्रि यादिमूल
मतँडु दॅवर्षि पित्रादिलॉकमुलकु; धर्मादुलकु महाधार मतँडे
७-३४.१-तॅटगीति
यॅ स्थलंबुल गॉ भूसुरॅंद्र वॅद; वर्णधर्माश्रमंबुलु वरुस नुंडु
ना स्थलंबुल केल्ल मी ररिगि चेर्रचि; दग्धमुलु जॅसि रंडु मी दर्प मोप्प.
పొండు = వెళ్ళండి; దానవులార = రాక్షసుల్లారా; భూసుర = బ్రాహ్మణులుండెడి {భూసురులు - భూమికి సురులు (దేవతలు), బ్రాహ్మణులు}; క్షేత్ర = ప్రదేశములతో; సంగత = కూడినది; ఐన = అయిన; భూమి = భూమండలమున; కిన్ = కు; గములు = గుంపులు; కట్టి = కొని; మఖ = యాగములు; తపః = తపస్సులు; సాధ్యాయ = వేదపఠనములు; మౌన = మునిత్వములు; వ్రతస్థుల = నిష్ఠగాజేయువారలను; వెదకి = వెతికి; ఖండింపుడు = నరకండి; విష్ణుడు = హరి; అనగన్ = అనగా; అన్యుడు = వేరే ఇతరుడు; ఒక్కడు = ఏ ఒక్కడును; లేడు = లేడు; యజ్ఞంబున్ = యాగములు; వేదంబున్ = వేదములును; అతడె = అతడే; భూదేవ = బ్రాహ్మణులుచేసెడి; క్రియా = కార్యములకు; ఆది = ముఖ్య; మూలము = మూలాధారము; అతడు = అతడు; దేవర్షి = దేవఋషులు; పిత్ర = పిత్రుదేవతలు; ఆది = మొదలగువారి; లోకముల్ = సర్వుల; కున్ = కు; ధర్మాదులు = ధర్మార్థకామముల; కున్ = కు; మహా = గొప్ప; ఆధారము = మూలాధారము; అతడె = అతడె.
ఏ = ఏ; స్థలంబులన్ = ప్రదేశములలో; గో = గోవులు; భూసురేంద్ర = బ్రాహ్మణులు; వేద = వేదములు; వర్ణధర్మములు = కులాచారములు; ఆచారములు = వేదాచారములు; వరుసన్ = చక్కగా; ఉండున్ = ఉండునో; ఆ = ఆ; స్థలంబులన్ = ప్రదేశముల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికిని; మీరు = మీరు; అరగి = వెళ్ళి; చెఱచి = పాడుచేసి; దగ్దములు = కాల్చబడినవిగా; చేసి = చేసి; రండు = రండి; మీ = మీ యొక్క; దర్పము = పౌరుషము; ఒప్పన్ = ఒప్పునట్లు.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment