7-39-సీస పద్యము
సర్వజ్ఞుఁ
డీశుండు సర్వాత్ముఁ
డవ్యయుం; డమలుండు సత్యుఁ డనంతుఁ డాఢ్యుఁ
డాత్మరూపంబున నశ్రాంతమును దన; మాయాప్రవర్తన మహిమవలన
గుణములఁగల్పించి గుణసంగమంబున; లింగశరీరంబు లీలఁ దాల్చి
కంపితజలములోఁ గదలెడి క్రియఁ దోచు; పాదపంబులభంగి భ్రామ్యమాణ
7-39.1-ఆటవెలది
చక్షువుల ధరిత్రి
చలితయై కానంగఁ; బడినభంగి, వికల భావరహితుఁ
డాత్మమయుఁడు గంపితాంతరంగంబునఁ; గదలినట్లు తోఁచుఁ గదల కుండు.
హిరణ్యకశిపుడు సోదరుని మరణంతో
దుఃఖిస్తున్న కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఇంకా ఇలా చెప్పసాగాడు. భగవంతుడు సర్వమూ
తెలిసినవాడు; సర్వానికి ఆయనే
అధిపతి; సర్వేసర్వత్రా నిండి ఉండేవాడు;
ప్రభువు సత్యుడూ; నిత్యుడూ, ఆద్యంతాలు లేనివాడూ, సర్వ
సంపన్నుడూ; అటువంటి ఆ విభుడు, ఆత్మరూపంలో నిరంతరం తన మాయా
ప్రవర్తన ఆదులతో త్రిగుణాలను కల్పించుకుంటాడు; ఆ గుణాల
సంయోగాలతో లింగశరీరాలు ధరిస్తాడు; కదలని చెట్లు కదులుతున్న
నీటిలో కదలాడుతున్నట్లు కనపడుతుంది కదా; భ్రమతో కూడి ఉన్న
కన్నులకు భూమి కదులుతున్నట్లు తోచుతుంది కదా; అలాగే, బావ
వికారాలు లేనట్టి ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు చలించే మనస్సుకల వాళ్ళకు చంచలుడుగానే
కనబడతాడు; కానీ ఆ పరమేశ్వరుడు అచంచలుడు;
७-३९-सीस पद्यमु
सर्वज्ञुँ डीशुंडु सर्वात्मुँ डव्ययुं; डमलुंडु सत्युँ डनंतुँ डाढ्युँ
डात्मरूपंबुन नश्रांतमुनु दन; मायाप्रवर्तन महिमवलन
गुणमुलँगल्पिंचि गुणसंगमंबुन; लिंगशरीरंबु लीलँ दाल्चि
कंपितजलमुलँ गदलेडि क्रियँ दॉचु; पादपंबुलभंगि भ्राम्यमाण
७-३९.१-आटवेलदि
चक्षुवुल धरित्रि चलितयै कानंगँ; बडिनभंगि, विकल भावरहितुँ
डात्ममयुँडु गंपितांतरंगंबुनँ; गदलिनट्लु तँचुँ गदल कुंडु.
సర్వజ్ఞుండు = అన్నియుతెలిసినవాడు; ఈశుండు = ప్రభువు; సర్వాత్ముడు = అందరిలోను ఉండువాడు; అవ్యయుండు = నాశములేనివాడు; అమలుండు = స్వచ్ఛమైనవాడు; సత్యుడు = సత్యమేతానైనవాడు; అనంతుడు = అవధులులేనివాడు; ఆఢ్యుడు = శ్రేష్ఠుడు; ఆత్మ = ఆత్మ యొక్క; రూపంబునన్ = స్వరూపముతో; అశ్రాంతమున్ = ఎల్లప్పుడును; తన = తన యొక్క; మాయా = మాయను; ప్రవర్తన్ = నడిపెడి; మహిమ = సామర్థ్యము; వలన = వలన; గుణములన్ = త్రిగుణములను; కల్పించి = సృష్టించి; గుణ = గుణముల యొక్క; సంగమంబునన్ = చేరికలవలన; లింగశరీరంబున్ = సూక్ష్మశరీరము {లింగశరీరము -
నామరూపాదులుగల దేహము}; లీలన్ = క్రీడగా; తాల్చి = ధరించి; కంపిత = కదలెడి; జలము = నీటి; లోన్ = అందు; కదలెడి = కదులుతున్న; క్రియన్ = వలె; తోచు = కనబడెడి; పాదపంబులన్ = చెట్లను; భంగిన్ = వలె; భ్రామ్యమాణ = తిరుగుతున్న.
చక్షువులన్ = కళ్ళకు; ధరిత్రి = భూమి; చలిత = కదులునది; ఐ = అయ్యి; కానంగబడిన = కనబడిన; భంగిన్ = వలెను; వికల = వికారములనెడి; భావము = స్వభావము; రహితుడు = లేనివాడు; ఆత్మమయుడు = ఆత్మయందుండువాడు; కంపిత = చలించెడి; అంతరంగంబునన్ = మనసులలో; కదలిన = కదులుచున్న; అట్లు = విధముగ; తోచున్ = అనిపించును కాని; కదలకుండు = చలనములేక యుండును.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment