7-53-సీస పద్యము
భూపాలకుఁడు నిద్రపోయెడి
నొండేమి; విలపింప నేటికి వెఱ్ఱులార!
యెవ్వఁడు భాషించు నెవ్వఁ
డాకర్ణించు; నట్టి వాఁ
డెన్నడో యరిగినాఁడు,
ప్రాణభూతుం డైన పవనుఁ
డాకర్ణింప; భాషింప
నేరఁడు, ప్రాణి దేహ
ములకు వేఱై తాన ముఖ్యుఁడై
యింద్రియ; వంతుఁడై
జీవుండు వలను మెఱయ,
7-53.1-ఆటవెలది
ప్రాభవమున భూతపంచకేంద్రియమనో; లింగదేహములను లీలఁ గూడు
విడుచు నన్యుఁ డొకఁడు విభుఁడు
దీనికి మీరు; పొగల నేల? వగలఁ బొరల నేల?
వెర్రివాళ్ళలారా! మీ అమాయకత్వాన్ని వదలిపెట్టండి; ఈ భూపతి (రాజ్యానికి
రాజు / క్షేత్రంలోని విభుడు) నిద్రిస్తున్నాడు. ఎందుకు
పిచ్చిగా విలపిస్తున్నారు. మాటలు పలికేవాడు, మాటలు వినేవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు.
ప్రాణానికి మూలమైనది వాయువు. కాని అది విడిగా ఉన్నా మాట్లాడలేదు, వినలేదు. జీవుడు
ప్రాణదేహాలకి వేరుగా ఉండి కూడా ముఖ్యుడై ఇంద్రియ ప్రాభవంతో తేజరిల్లుతూ ఉంటాడు. ఆ
ఆత్మరూపుడే పంచభూతాలనూ, పంచేంద్రియాలనూ, మనస్సునూ, లింగదేహమునూ విలాసంగా
ధరిస్తాడు. మళ్ళీ విడిచిపెడతాడు. అసలు ఈ ప్రపంచ చక్రం తిప్పేవాడు వేరే ఉన్నాడు.
అతడు సర్వాధిపతి. కాబట్టి, దీనికోసం మీరు బాధపడటం దేనికి?
దుఃఖంతో ఏడవటం దేనికి?
७-५३-सीस पद्यमु
भूपालकुँडु
निद्रपॉयेडि नोंडॅमि; विलपिंप नॅटिकि
वेर्र्र्रुलार!
येव्वँडु भाषिंचु
नेव्वँ डाकर्णिंचु; नट्टि वाँ डेन्नडॉ यरिगिनाँडु,
प्राणभूतुं डैन
पवनुँ डाकर्णिंप; भाषिंप नॅरँडु, प्राणि दॅह
मुलकु वॅर्रै तान
मुख्युँडै यिंद्रिय; वंतुँडै जीवुंडु वलनु मेर्रय,
७-५३.१-आटवेलदि
प्राभवमुन
भूतपंचकॅंद्रियमनॉ; लिंगदॅहमुलनु लीलँ गूडु
विडुचु नन्युँ
डोकँडु विभुँडु दीनिकि मीरु; पोगल नॅल? वगलँ बोरल नॅल?
భూపాలకుడు = రాజు {భూపాలకుడు - భూ (రాజ్యమును) పాలకుడు (ఏలెడివాడు), రాజు}; నిద్రపోయెడిన్ = నిద్రపోవుచున్నాడు; ఒండు = మరింకా; ఏమి = ఏమి యున్నది; విలపింపన్ = శోకించుట; ఏటికిన్ = ఎందుకు; వెఱ్ఱులార = తెలివితక్కువవారా; ఎవ్వడు = ఎవడైతే; భాషించున్ = పలుకునో; ఎవ్వడు = ఎవడైతే; ఆకర్ణించున్ = వినునో; అట్టి = అటువంటి; వాడు = అతడు; ఎన్నడో = ఎప్పుడో; అరిగినాడు = వెళ్ళిపోయినాడు; ప్రాణభూతుండు = ప్రాణ మైనవాడు; ఐన = అయిన; పవనుడు = వాయువు; ఆకర్ణింపన్ = వినుటను; భాషింపన్ = పలుకుటను; నేరడు = చేయలేడు; ప్రాణి = జీవుడు; దేహముల్ = దేహముల; కున్ = కంటెను; వేఱు = భిన్నమైనవాడు; ఐ = అయ్యి; తాన = తనే; ముఖ్యుడు = ప్రధాన మైనవాడు; ఐ = అయ్యి; ఇంద్రియవంతుడు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; జీవుండు = జీవుడు; వలను = నేర్పులు; మెఱయన్ = మీరగా, అతిశయించగా.
ప్రాభవమునన్ = ఐశ్వర్యముతో; భూతపంచక = పంచమహాభూతములు; ఇంద్రియ = పంచేంద్రియములు; మనస్ = మనస్సు; లింగదేహములన్ = సూక్ష్మశరీరములను; లీలన్ = వేడుకగా; కూడును = కలయును; విడుచున్ = వదలివేయును; అన్యుడొకడు = ఇంకొకడు; విభుడు = ప్రభువు; దీని = ఇట్టివిషయమున; కిన్ = కు; మీరు = మీరు; పొగలన్ = శోకింపగా; ఏల = ఎందులకు; వగలన్ = దుఃఖములందు; పొరలన్ = పొర్లుట; ఏల = ఎందులకు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment