7-70-వచనము
అని తెలియం బలికిన
హిరణ్యకశిపుని వచనంబులు విని దితి గోడండ్రునుం దానును శోకంబు మాని తత్త్వవిలోకనంబు
గలిగి లోకాంతరగతుండైన కొడుకునకు వగవక చనియె" నని చెప్పి నారదుండు ధర్మనందనున
కిట్లనియె.
ఇలా
హిరణ్యకశిపుడు తెలియ జెప్పగా, దితి, ఆమె కోడళ్ళు దుఃఖం మానేసారు. తత్వం
తెలుసుకున్నారు. చనిపోయిన కొడుకు కోసం విలపించటం మాని వెళ్ళిపోయారు” అని నారదమహర్షి యుధిష్టర మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు.
७-७०-वचनमु
अनि तेलियं बलिकिन
हिरण्यकशिपुनि वचनंबुलु विनि दिति गॉडंड्रुनुं दानुनु शॉकंबु मानि तत्त्वविलॉकनंबु
गलिगि लॉकांतरगतुंडैन कोडुकुनकु वगवक चनिये" ननि चेप्पि नारदुंडु धर्मनंदनुन
किट्लनिये.
అని = అని; తెలియన్ = బోధపడునట్లు; పలికినన్ = చెప్పగా; హిరణ్యకశిపుని = హిరణ్యకశిపుని; వచనంబులు = మాటలు; విని = విని; దితి = దితి; కోడండ్రును = కోడళ్ళు; తానునున్ = తను; శోకంబు = దుఃఖము; మాని = విడిచిపెట్టి; తత్త్వ = తత్త్వము యొక్క; విలోకనంబు = దృష్టి; కలిగి = పొంది; లోక = లోకము; అంతర = ఇతరమైనదానికి; గతుండు = వెళ్ళినవాడు; ఐన = అయిన; కొడుకున్ = పుత్రున; కున్ = కు; వగవక = విచారించక; చనియెన్ = వెళ్ళిపోయిరి; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ధర్మనందనున్ = ధర్మరాజున {ధర్మనందనుడు
- యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment