7-62-కంద పద్యము
ఒకమాటు మనల నందఱఁ
బ్రకటించి కిరాతువలలఁ బడఁజేయక
ని
న్నొకతిన్ వలఁబడఁ జేసిన
వికటీకృతదక్ష మైన విధి నే
మందున్.
వంకరపనులు
చేయటంలో మిక్కిలి నేర్పున్న ఈ విధిని ఏమని నిందించాలి?
నిన్ను ఒక్కదానిని బోయవాడి వలలో పడమని వ్రాసాడు చూడు! కనీసం
మనం అందరం ఒకేమాటు వాడి వలలో పడమని వ్రాయవచ్చు కదా!
७-६२-कंद पद्यमु
ओकमाटु मनल नंदर्रँ
ब्रकटिंचि
किरातुवललँ बडँजॅयक नि
न्नोकतिन वलँबडँ
जॅसिन
विकटीकृतदक्ष मैन
विधि नॅ मंदुन.
ఒకమాటు = ఒకేసారి; మనలన్ = మనలను; అందఱన్ = అందరిని; ప్రకటించి = నియమించి; కిరాతు = బోయవాని; వలలన్ = వలలలో; పడన్ = పడునట్లు; చేయక = చేయకుండగ; నిన్నున్ = నిన్ను; ఒకటిన్ = ఒక్కదానిని; వలన్ = వలయందు; పడన్ = పడునట్లు; చేసిన = చేసినట్టి; వికటీ = వంకరపనులు; కృత = చేయుటందు; దక్షము = నేర్పరి; ఐన = అయిన; విధిన్ = దైవమును; ఏమి = ఏమి; అందున్ = అనగలను.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment