7-54-కంద పద్యము
ఎందాఁక నాత్మ దేహము
నొందెడు నందాఁకఁ గర్మయోగము; లటపైఁ
జెందవు; మాయాయోగ
స్పందితులై రిత్త జాలిఁ బడ
నేమిటికిన్?
ఎప్పటి వరకు ఆత్మ దేహంలో ఉంటుందో
అప్పటివరకూ కర్మలతో సాంగత్యం సాగుతూనే ఉంటుంది. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టగానే
కర్మబంధాలు తెగిపోతాయి. వీటితో సంబంధమే ఉండదు. ఈ మయాయోగానికి చలించిన మనసులతో మీరు
కుమిలిపోవడం అనవసరం.
७-५४-कंद पद्यमु
एंदाँक नात्म दॅहमु
नोंदेडु नंदाँकँ गर्मयॉगमु; लटपैँ
जेंदवु; मायायॉग
स्पंदितुलै रित्त जालिँ बड नेमिटिकिन?
ఎందాకన్ = ఎప్పటివరకు; ఆత్మ = ఆత్మ; దేహమున్ = దేహమును; ఒందెడున్ = చెందియుండునో; అందాక = అప్పటివరకు; కర్మ = కర్మముల; యోగములు = సంబంధములు; అటపైన్ = ఆతరువాత; చెందవు = సంబంధములుండవు; మాయా = మాయతో; యోగ = కలియుటవలన; స్పందితులు = చలించినవారు; ఐ = అయ్యి; రిత్తన్ = ఊరకనే; జాలిన్ = దైన్యమునందు; పడన్ = పడిపోవుట; ఏమిటికిన్ = ఎందుకు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment