7-71-కంద పద్యము
అజరామర భావంబును
ద్రిజగద్రాజ్యంబు నప్రతిద్వంద్వము
దో
ర్విజితాఖిలశాత్రవమును
గజరిపుబలమును హిరణ్యకశిపుఁడు
గోరెన్.
హిరణ్యకశిపుడు తనకు
ముసలితనం కానీ చావు కానీ లేని అమరత్వం కావాలని కోరుకున్నాడు; ఇంకా ముల్లోకాలను ఎదురు లేకుండా పరిపాలించే శక్తినీ, బాహుబలంతో శత్రువులను ఎవరినైనా జయించే బలాన్నీ, సింహపరాక్రమం పొందాలనీ ఆశించాడు.
७-७१-कंद पद्यमु
अजरामरभावंबुनु
द्रिजगद्राज्यंबु
नप्रतिद्वंद्वमु दो
र्विजिताखिलशात्रवमुनु
गजरिपुबलमुनु
हिरण्यकशिपुँडु गोरेन.
అజర = ముసలితనములేని; అమర = చావులేని; భావంబును = స్థితిని; త్రిజగత్ = ముల్లోకము లందు విస్తరించిన; రాజ్యంబున్ = రాజ్యాధికారము; అప్రతిద్వంద్వమున్ = ఎదురులేనిది, నిష్కంటకము; దోః = బాహు బలముతో; విజిత = జయించబడిన; అఖిల = సమస్తమైన; శాత్రవమున్ = శత్రువులు కలుగుట; గజరిపు = సింహము వంటి {గజరిపు - గజము (ఏనుగు)నకు రిపు (శత్రువు), సింహము}; బలమును = శక్తి; హిరణ్యకశిపుడు = హిరణ్యకశిపుడు; కోరెన్ = ఆశించెను.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment