Friday, July 10, 2015

సుయజ్ఞోపాఖ్యానము - అనియిట్లురాజభార్య

7-45-వచనము
అని యిట్లు రాజభార్య లా రాజశవంబు డగ్గఱి విలపింపం బ్రొద్దు గ్రుంకెడు సమయంబున వారల విలాపంబులు విని బ్రాహ్మణబాలకుం డై యముండు చనుదెంచి ప్రేతబంధువులం జూచి యిట్లనియె.
          ఆ విధంగా ఆ రాణులు సుయజ్ఞుని శవం వద్ద విలపిస్తుండగా యమధర్మరాజు విన్నాడు. అప్పుడు ఓ ప్రక్క సూర్యాస్తమయ సమయం అవుతోంది.  యముడు బ్రాహ్మణ బాలుడి రూపుదాల్చి వచ్చి ఆ ప్రేతబంధువులు (శవం యొక్క బంధువులు) వద్దకు వచ్చి వారితో ఇలా అన్నాడు.
७-४५-वचनमु
अनि यिट्लु राजभार्य ला राजशवंबु डग्गर्रि विलपिंपं ब्रोद्दु ग्रुंकेडु समयंबुन वारल विलापंबुलु विनि ब्राह्मणबालकुं डै यमुंडु चनुदेंचि प्रॅतबंधुवुलं जूचि यिट्लनिये.
          అని = అని; ఇట్లు = ఈ విధముగా; రాజ = రాజు యొక్క; భార్యలు = సతులు; = ; రాజ = రాజు యొక్క; శవంబు = మృతశరీరము, పీనుగు; డగ్గఱి = దగ్గరకు చేరి; విలపింపన్ = ఏడ్చుచుండగా; ప్రొద్దు = సూర్యుడు; క్రుంకెడు = అస్తమయపు; సమయంబునన్ = సమయమునందు; వారల = వారి యొక్క; విలాపంబులు = ఏడుపులు; విని = విని; బ్రాహ్మణ = బ్రహ్మణ వంశపు; బాలకుండు = చిన్నపిల్లవాడు; = వలె; యముండు = యముడు; చనుదెంచి = వచ్చి; ప్రేత = పీనుగు యొక్క; బంధువులన్ = చుట్టములను; చూచి = చూచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: