7-46-ఉత్పలమాల
మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ
జోద్యము దేహి పుట్టుచుం
జచ్చుచు నుంటఁ జూచెదరు చావక
మానెడువారిభంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావున
కొల్లక డాఁగ వచ్చునే?
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేఁగుట
నైజము ప్రాణికోటికిన్.
వీరి ఈ మోహం ఎంతో వింతగా
ఉంది. దేహం ధరించే ప్రతివాడు పుట్టటం తప్పదు, చావటం తప్పదు. ఎక్కడ దాక్కున్నా ఎవరూ
చావు తప్పించుకోలేరు కదా. జీవులు ఎక్కడ నుండి వచ్చారో అక్కడకు పోవడం సహజం. అందరూ
పుడుతూ, చస్తూ ఉండటం రోజూ చూస్తూ కూడా, చచ్పిన వాళ్ళ కోసం మక్కువలు ఎక్కువగా
పెంచుకుని ఏడుస్తుంటారు. ఎంత చోద్యమో.
७-४६-उत्पलमाल
मच्चिक वीरिकेल्ल
बहुमात्रमुँ जॉद्यमु दॅहि पुट्टुचुं
जच्चुचु नुंटँ
जूचेदरु चावक मानेडुवारिभंगि नी
चच्चिनवारि
कॅड्चेदरु चावुन कोल्लक डाँग वच्चुनॅ?
येच्चटँ बुट्टे
नच्चटिकि नॅँगुट नैजमु प्राणिकॉटिकिन.
మచ్చికన్ = చనువుతో; వీరి = వీరి; కిన్ = కి; ఎల్లన్ = అందరకును; బహు = అధికముగా; మాత్రము = యైన; చోద్యము = చిత్రము; దేహి = జీవుడు {దేహి -
దేహము (శరీరమును) ధరించినవాడు, జీవుడు}; పుట్టుచున్ = జన్మించుచు; చచ్చుచున్ = మరణించుచు; ఉంటన్ = ఉండుటను; చూచెదరు = చూచుచునేయుందురు కాని; చావక = మరణించకుండగ; మానెడు = మానివేసెడివారి; భంగిన్ = విధముగా; ఈ = ఈ; చచ్చిన = చచ్చిపోయిన; వారి = వారల; కిన్ = కు; ఏడ్చెదరు = దుఃఖించెదరు; చావున్ = మరణమునకు; ఒల్లక = అంగీకరించక; డాగన్ = దాగికొనుటకు; వచ్చునే = సాధ్యమగునా ఏమి; ఎచ్చటన్ = ఎక్కడనుండి; పుట్టెన్ = వచ్చి పుట్టెనో; అచ్చట = అక్కడ; కిన్ = కి; ఏగుట = వెళ్ళుట; నైజము = స్వాభావికము; ప్రాణి = జీవుల; కోటికిన్ = అందరు; కిన్ = కు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment