Thursday, July 23, 2015

సుయజ్ఞోపాఖ్యానము - అడవులమేత

7-61-చంపకమాల
వులమేఁత మేసి మనన్యుల కెన్నఁడు నెగ్గు జేయ కి
క్కవిహరింప నేఁ డకట ట్టిఁడి బ్రహ్మ కిరాతు చేతిలోఁ
డు మని వ్రాసెనే నుదుటఁ బాపపు దైవము కంటి కింత యె
క్కుడు బరువయ్యెనే బ్రదుకు గోమలి! యే మన నేర్తుఁ జెల్లరే.
            ఓ కోమలమైన ప్రియురాలా! మనం ఎవరికీ అపకారం చేసేవాళ్ళం కాదు. ఈ మానవులకు ఎప్పుడూ కీడు చేసేవాళ్ళం కాదు, అడవిలో దొరికే మేతలు మేసి జీవిస్తుంటాము. ఏం చెప్పమంటావు? కఠిన హృదయుడైన బ్రహ్మదేవుడు ఈ బోయవాడి చేతిలో చావమని మనల నుదుట వ్రాసాడేమో? ఈ పాపపు దేవుడి దృష్టిలో కూడా ఇంత బరువైపోయామా ఏమిటి?
७-६१-चंपकमाल
“अडवुलमेँत मेसि मनमन्युल केन्नँडु नेग्गु जेय कि
क्कड विहरिंप नेँ डकट कट्टिँडि ब्रह्म किरातु चेतिलोँ
बडु मनि व्रासेने नुदुटँ बापपु दैवमु कंटि किंत ये
क्कुडु बरुवय्येने ब्रदुकु गॉओमलि! ये मन नेर्तुँ जेल्लरे.
            అడవులన్ = అడవులలో; మేత = ఆహారమును; మేసి = తిని; మనము = మనము; అన్యుల్ = ఇతరుల; కిన్ = కి; ఎన్నడున్ = ఎప్పుడును; ఎగ్గు = కీడు; చేయక = చేయకుండగ; ఇక్కడ = ఇక్కడ; విహరింపన్ = తిరుగుచుండగ; నేడు = ఈరోజు; అకట = అయ్యో; కట్టిడి = కఠినుడైన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; కిరాతు = బోయవాని; చేతి = చేతి; లోన్ = అందు; పడుము = చావుము; అని = అని; వ్రాసెనే = రాసెనుకదా; నుదుటన్ = నొసటియందు; పాపపు = పాపిష్టి; దైవము = దేవుని; కంటి = కన్నుల; కి = కు; ఇంత = ఇంత; ఎక్కుడు = అధికముగా; బరువు = భారము; అయ్యెనే = అయిపోయిందికదా; బ్రతుకు = జీవితము; కోమలి = ఓ స్త్రీ; ఏమననేర్తు = ఏమనగలను; చెల్లరే = ఔరా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: