7-50-కంద పద్యము
కలుగును మఱి లేకుండును
గల భూతము లెల్లఁ గాలకర్మవశములై
నిలుఁవడు ప్రకృతిం దద్గుణ
కలితుఁడు గాఁ డాత్మమయుఁ డగమ్యుఁడు
దలపన్.
ఆయన నియమించినట్లు
ప్రకృతిలో, త్రిగుణాలతో కూడి జీవులన్నీ కాలానికి, కర్మలకు వశమై పుడుతూ, చస్తూ
ఉంటాయి. కాని భగవంతుడు ప్రకృతికి త్రిగుణాలకి లొంగి ఉండడు. ఆయన త్రిగుణాలు కలవాడు
కాడు, త్రిగుణాలకి అతీతుడు. సమస్తమందు ఆత్మరూపంలో నిండి ఉంటాడు. ఆ పరమాత్మ తత్వం
ఎవరికి అర్థం గాదు.
७-५०-कंद पद्यमु
कलुगुनु मर्रि
लॅकुंडुनु
गल भूतमु लेल्लँ
गालकर्मवशमुलै
निलुँवडु प्रकृतिं
दद्गुण
कलितुँडु गाँ
डात्ममयुँ डगम्युँडु दलपन.
కలుగును = పుట్టును; మఱి = మరల; లేకుండును = నశించును; కల = ఉన్నట్టి; భూతములు = జీవులు; ఎల్లన్ = అన్నియును; కాల = కాలమునకు; కర్మ = కర్మమునకు; వశములు = లోబడినవి; ఐ = అయ్యి; నిలువడు = ప్రతిష్టింపడును; ప్రకృతిన్ = ప్రకృతిలో; తత్ = ఆ దేహము యొక్క; గుణ = గుణములతో; కలితుఁడు = కూడినవాడు; కాడు = అవ్వడు; ఆత్మ = ఆత్మ; మయుడు = స్వరూపుడు; అగమ్యుడు = పొందరానివాడు; తలపన్ = విచారించగా.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment