Tuesday, July 21, 2015

సుయజ్ఞోపాఖ్యానము - కట్టలుకఁ

7-59-కంద పద్యము
ట్టలుకఁ దడుకుచాటునఁ
బిట్టల నురిగోలఁ దిగిచి, బిఱుసున ఱెక్కల్
ట్టి విఱిచి, చిక్కములోఁ
బెట్టుచు విహరించె లోకభీకరలీలన్.
          ఆ బోయ తడిక మాటున కూర్చొని, పక్షులను మిక్కిలి కోపంతో ఉచ్చుకర్రతోనూ, వలలు వేసీ పట్టుకుంటున్నాడు. దొరికిన పిట్టల రెక్కలు కరుకుగా విరిచి, చిక్కంలో వేస్తున్నాడు. అలా పక్షుల ప్రాణానికి జగద్భయంకరంగా ఆ అడవిలో సంచరిస్తూ ఉన్నాడు.
७-५९-कंद पद्यमु
कट्टलुकँ दडुकुचाटुनँ
बिट्टल नुरिगॉलँ दिगिचि, बिर्रुसुन र्रेक्कल
पट्टि विर्रिचि, चिक्कमुलँ
बेट्टुचु विहरिंचे लॉकभीकरलीलन.
          కట్టలుకన్ = ఎక్కువ చలముతో; తడుకు = కంచెల; చాటునన్ = మాటునందు; పిట్టలన్ = పక్షులను; ఉరిగోలన్ = ఉచ్చుకఱ్ఱతో; తిగిచి = లాగి; బిఱుసున = కఱుకుదనముతో; ఱెక్కల్ = రెక్కలను; పట్టి = పట్టుకొని; విఱిచి = వెనుకకివంచికట్టి; చిక్కము = తాళ్లతో చేసినసంచీ; లోన్ = అందు; పెట్టుచున్ = పెడుతూ; విహరించెన్ =
తిరిగెను; లోక = (పక్షి)లోకమునకు; భీకర = భయంకరమైన; లీలన్ = విధముగ.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: