7-56-వచనము
మఱియు, మాయాగుణప్రపంచంబు నెఱింగెడు
తత్త్వజ్ఞులు నిత్యానిత్యంబులం గూర్చి సుఖదుఃఖంబులం జెంద; రజ్ఞులు
గొందఱు యోగ వియోగంబులకు సుఖదుఃఖంబుల నొందుదురు; తొల్లి యొక్క
మహా గహనంబున విహగంబులకు నంతకభూతుం డైన యెఱుక గల డతం డొక్కనాఁడు ప్రభాతంబున లేచి
వాటంబైన వేఁటతమకంబున,
మాయ యొక్క
గుణాలు అయిన దేహ గేహాదుల తత్వం తెలిసిన తత్వవేత్తలు ఎప్పటికైనా నశించునవి అయిన
వాటి గురించి సుఖదుఃఖాలు పెంచుకొని కలతచెందరు. అజ్ఞానాంధులైన కొందరు ఈ మాయాగుణాలైన
దేహాదుల సంయోగ వియోగాలకు కలత చెందుతూ ఉంటారు. పూర్వం బోయవాడు ఒకడు అడవిలో పక్షులను
వేటాడుతూ వాటి పాలిటి యముడులా జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకానొక రోజున వేటాడాలనే
గట్టి కోరికతో మరులుగొని, సూర్యోదయం కాగానే లేచి బయలుదేరాడు.
७-५६-वचनमु
मर्रियु, मायागुणप्रपंचंबु
नेर्रिंगेडु तत्त्वज्ञुलु नित्यानित्यंबुलं गूर्चि सुखदुःखंबुलं जेंद; रज्ञुलु गोंदर्रु
यॉग वियॉगंबुलकु सुखदुःखंबुल नोंदुदुरु; तोल्लि योक्क महा गहनंबुन विहगंबुलकु नंतकभूतुं डैन येर्रुक
गल डतं डोक्कनाँडु प्रभातंबुन लेचि वाटंबैन वेँटतमकंबुन,
మఱియున్ = ఇంకను; మాయా = మాయ యొక్క; గుణ = గుణములైన; ప్రపంచంబున్ = సమస్తమును; ఎఱింగెడు = తెలిసెడి; తత్త్వజ్ఞులు = నిజశాస్త్రములు తెలిసినవారు; నిత్య = శాశ్వతములు; అనిత్యంబులన్ = అశాశ్వతములను; కూర్చి = గురించి; సుఖ = సుఖములను; దుఃఖంబులను = దుఃఖములను; చెందరు = లోనుకారు; అజ్ఞులు = జ్ఞానములేనివారు; కొందఱు = కొంతమంది; యోగ = సంయోగ; వియోగంబుల్ = వియోగముల; కున్ = కు; సుఖ = సుఖములను; దుఃఖంబులన్ = దుఃఖములను; ఒందుదురు = పొందెదరు; తొల్లి = పూర్వము; ఒక్క = ఒక; మహా = దట్టమైన; గహనంబునన్ = అడవియందు; విహంగముల్ = పక్షుల; కున్ = కు; అంతకభూతుండు = యముడైనవాడు; ఐన = అయిన; ఎఱుక = బోయవాడు; కలడు = ఉండెను; అతండు = అతడు; ఒక్కనాడు = ఒకరోజు; ప్రభాతంబున = వేకువసమయమున; లేచి = నిద్రలేచి; వాటంబు = నేర్పుగలది; ఐన = అయినట్టి; వేట = వేటాడుటయందు; తమకంబునన్ = గాఢమైన కోరికతో.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment