7-40-వచనము
అవ్వా! యివ్విధంబున
లక్షణవంతుండు గాని యీశ్వరుండు లక్షితుండై కర్మసంసరణంబున యోగవియోగంబుల నొందించు
సంభవ వినాశ శోక వివేకావివేక చింతా స్మరణంబులు వివిధంబు; లీ యర్థంబునకుఁ బెద్దలు ప్రేతబంధు యమ
సంవాదం బను నితిహాసంబు నుదాహరింతురు; వినుండు, చెప్పెద; నుశీనరదేశంబు నందు సుయజ్ఞుండను రాజు గలం;
డతండు శత్రువులచేత యుద్ధంబున నిహతుం డయి యున్నయెడ.
ఆ భగవంతుడు “ఇదిగో ఈ లక్షణాలతో ఉంటాడు” అని నిర్ధారణ చేసి గుర్తులు
ఏమీ చెప్పలేము; ఆయన గుర్తులకు అతీతుడు;
కాని ఆ పరముడు ఒక్కొక్క సారి లక్షణాలు పొంది, సంసార బంధాలలో ప్రవేశించి సంయోగ
వియోగాలను కలుగజేస్తాడు; అవి పుట్టుక, మరణం, దుఃఖము, తెలివి,
అవివేకము, చింత, స్మరణ అని అనేక రకాలుగా ఉంటాయి; ఈ
పరమార్థాన్ని చెప్పడానికి పెద్దలు ప్రేతబంధు యమ సంవాదం అనే కథ చెప్తుంటారు. దానిని
చెప్తాను వినండి; పూర్వం గాంధారదేశంలో సుయజ్ఞుండు అనే రాజు
ఉండేవాడు. అతడు యుద్ధంలో శత్రువులకు చిక్కి మరణించాడు. ఆ సమయంలో.
७-४०-वचनमु
अव्वा! यिव्विधंबुन
लक्षणवंतुंडु गानि यीश्वरुंडु लक्षितुंडै कर्मसंसरणंबुन यॉगवियॉगंबुल नोंदिंचु
संभव विनाश शॉक विवॅकाविवॅक चिंता स्मरणंबुलु विविधंबु; ली यर्थंबुनकुँ बेद्दलु प्रॅतबंधु यम संवादं बनु
नितिहासंबु नुदाहरिंतुरु; विनुंडु, चेप्पेद; नुशीनरदॅशंबु नंदु सुयज्ञुंडनु राजु गलं; डतंडु शत्रुवुलचॅत युद्धंबुन निहतुं डयि युन्नयेड.
అవ్వా
= అమ్మా; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; లక్షణవంతుండు = గుర్తులు గలవాడు; కాని = కానట్టి; ఈశ్వరుండు = భగవంతుడు; లక్షితుండు = లక్షణములు గలవాడు; ఐ = అయ్యి; కర్మ = కర్మముల; సంసరణంబులన్ = ప్రవాహము వలన; యోగ = కలియుట; వియోగంబులన్ = దూరమగుటలను; పొందించున్ = కలిగించును; సంభవ = పుట్టుట; వినాశ = చనిపోవుట; శోక = దుఃఖము; వివేక = తెలివి; అవివేక = తెలివి లేమి; చింతా = యోచన; స్మరణంబులు = తలచుటలు; వివిధంబులు = పలు విధంబులు; ఈ = ఈ; అర్థంబున్ = విషయము; కున్ = అందు; పెద్దలు = జ్ఞానులు; ప్రేత = శవము యొక్క; బంధు = బంధువులకు; యమ = యమునకు; సంవాదంబు = జరిగిన సంభాషణము; అను = అనెడి; ఇతిహాసమున్ = చరిత్రమును; ఉదహరింతురు = ఉదాహరణగా చెప్పెదరు; వినుండు = వినండి; చెప్పెదను = చెప్పెదను; ఉశీనర = ఉశీనరము యనెడి {ఉశీనరదేశము
- గాంధార దేశము}; దేశంబున్ = దేశము; అందు = లో; సుయజ్ఞుండు = సుయజ్ఞుడు; అను = అనెడి; రాజు = రాజు; కలండు = ఉన్నాడు; అతండు = అతడు; శత్రువుల్ = శత్రువుల; చేత = చేత; యుద్ధంబునన్ = యుద్ధమునందు; నిహతుండు = మరణించినవాడు; అయి = అయ్యి; ఉన్న = ఉన్న; ఎడ = సమయములో.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment