7-66-కంద పద్యము
కాలము వచ్చిన శబరుని
కోలను ధరఁగూలె ఖగము ఘోషముతోడం
గాలము డాసిన నేలం
గూలక పో వశమె యెట్టి గుణవంతులకున్.
కాలం మూడిన ఆ మగ పక్షి
గోలపెట్టిమరీ అలా బోయవాడి బాణం దెబ్బతిని పడి చచ్పిపోయింది. అవును, ఆయువు తీరిన
తరువాత చావకుండా ఉండటం అన్నది ఎంతటి తెలివైనవాడైనా, బలవంతుడైనా, అధికార సంపదలు
కలవాడి కైనా అసాధ్యమే కదా.
७-६६-कंद पद्यमु
कालमु वच्चिन
शबरुनि
कोलनु धरँगूले खगमु
घोषमुतोडं
गालमु डासिन नेलं
गूलक पो वशमे
येट्टि गुणवंतुलकुन.
కాలము = అదను, సమయము; వచ్చిన = రాగా; శబరుని = కోయవాని; కోలను = బాణమువలన; ధరన్ = నేలపైన; కూలెన్ = పడిపోయెను; ఖగము = పక్షి; ఘోషము = గోలపెట్టుట; తోడన్ = తోటి; కాలము = కాలము, అదను; డాసిన = కలిసివచ్చిన; నేలంగూలక = మరణించకుండుట; వశమె = సాధ్యమేనా ఏమి; ఎట్టి = ఎటువంటి; గుణవంతుల = తెలివిగలవారి; కున్ = కైనను.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment