7-41-సీస పద్యము
చిరిఁగిన బహురత్న చిత్రవర్మముతోడ; రాలినభూషణ రాజితోడ
భీకరబాణ నిర్భిన్న
వక్షముతోడఁ; దఱచుఁ
గాఱెడు శోణితంబుతోడఁ
గీర్ణమై జాఱిన కేశబంధముతోడ; రయరోషదష్ట్రాధరంబుతోడ
నిమిషహీనంబైన నేత్రయుగ్మముతోడ; భూరజోయుత ముఖాంబుజముతోడఁ
7-41.1-ఆటవెలది
దునిసిపడిన దీర్ఘ దోర్దండములతోడ; జీవరహితుఁ డగు నుశీనరేంద్రుఁ
జుట్టి బంధుజనులు సొరిది
నుండఁగ భయా; క్రాంత లగుచు నతని కాంత లెల్ల.
అలా మరణించిన ఆ మహారాజు
సుయజ్ఞుడి కళేబరం ఎలా పడి ఉందంటే. అనేక మణులు పొదిగిన ఎంతో చక్కటి రత్నకవచం
చిరిగిపోయింది. ధరించిన భూషణాలు అన్ని రాలిపోయాయి. శత్రువుల భయంకరమైన వాడి బాణాల
దెబ్బలకు వక్షస్థలం పగిలిపోయింది. రక్తం కారుతోంది. జుట్టు ముడి జారి విడిపోయి
చిక్కులు పడిపోయింది. కోపంతో కరచుకున్న పెదవులు దంతాలు బిగుసుకుపోయాయి. కనురెప్పల
కదలిక పోయి రెండు కళ్ళు మిడిగుడ్లు పడ్డాయి. ముఖమంతా ధూళి దుమ్ము కొట్టుకుపోయింది.
పొడవైన చేతులు అక్కడే తెగి పడి ఉన్నాయి. ఆ గాంధార మహారాజు శవం చుట్టూ బంధ బలగం
గుమిగూడి ఉన్నారు. అతని భార్యలు అందరూ భయపడిపోతూ, విలపిస్తున్నారు.
७-४१-सीस पद्यमु
चिरिँगिन बहुरत्न
चित्रवर्ममुतॉड; रालिनभूषण राजितॉड
भीकरबाण निर्भिन्न
वक्षमुतॉडँ; दर्रचुँ गार्रेडु
शॉणितंबुतॉडँ
गीर्णमै जार्रिन
कॅशबंधमुतॉड; रयरॉषदष्ट्राधरंबुतॉड
निमिषहीनंबैन
नॅत्रयुग्ममुतॉड; भूरजॉयुत
मुखांबुजमुतॉडँ
७-४१.१-आटवेलदि
दुनिसिपडिन दीर्घ
दॉर्दंडमुलतॉड; जीवरहितुँ डगु
नुशीनरॅंद्रुँ
जुट्टि बंधुजनुलु
सोरिदि नुंडँग भया; क्रांत लगुचु नतनि कांत लेल्ल.
చిరిగిన = చినిగిన; బహు = అనేక; రత్న = రత్నములుగూర్చబడిన; చిత్ర = సొగసైన; వర్మము = కవచము; తోడ = తోటి; రాలిన = రాలిపడిపోయిన; భూషణ = అలంకారముల; రాజి = సమూహము; తోడ = తోటి; భీకర = భయముకలిగించెడి; బాణ = బాణములచే; నిర్భిన్న = చీల్చబడిన; వక్షము = రొమ్ము; తోడన్ = తోటి; తఱచుగాన్ = అధికముగా; కాఱెడు = కారుతున్న; శోణితంబు = నెత్తురు; తోడన్ = తోటి; కీర్ణము = చెదరినది; ఐ = అగుటచే; జాఱిన = జారిపోయిన; కేశ = జుట్టు; బంధము = ముడి; తోడన్ = తోటి; రయ = వడిగల; రోష = కసివలన; దష్ట్రా = కొరకబడిన; అధరంబున్ = పెదవి; తోడన్ = తోటి; నిమిష = రెప్పపాటులు; హీనంబు = లేకపోయినవి; ఐన = అయిన; నేత్ర = కన్నుల; యుగ్మము = జంట; తోడన్ = తోటి; భూరజస్ = మట్టిదుమ్ముతో; యుత = కూడిన; ముఖ = ముఖము యనెడి; అంబుజము = తామరపువ్వు; తోడన్ = తోటి; తునిసి = తెగి; పడిన = పడిపోయిన.
దీర్ఘ = పొడవైన; దోః = చేతులు యనెడి; దండముల = దండములు; తోడ = తోటి; జీవ = ప్రాణము; రహితుండు = లేనివాడు; అగు = అయిన; ఉశీనరేంద్రున్ = ఉశీనర మహారాజును; చుట్టి = చుట్టును చేరి; బంధు = బంధువులు ఐన; జనులు = వారు; సొరిదిన్ = వరుసలుదీరి; ఉండగా = ఉండగా; భయ = భయముచేత; ఆక్రాంతలు = ఆవరింపబడినవారు; అగుచున్ = అగుచు; అతని = అతని యొక్క; కాంతలు = భార్యలు; ఎల్ల = అందరును.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment