Saturday, July 25, 2015

సుయజ్ఞోపాఖ్యానము - ఱెక్కలు రావు

7-63-ఉత్పలమాల
ఱెక్కలు రావు పిల్లలకు ఱేపటినుండియు మేఁత గానమిం
బొక్కెడు గూటిలో నెగసి పోవఁగ నేరవు; మున్ను తల్లి యీ
దిక్కుననుండి వచ్చు నని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులుఁ జూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా!
          మన పిల్లలకేమో ఇంకా రెక్కలు రాలేదు. రేపటినుండి ఆహారం కనబడక ఏడుస్తూ ఉంటాయి. ఫోనీ ఎగిరి వెళ్ళి తెచ్చుకుందా మంటే వాటికింకా ఎగరటం కూడ రాదు. అయ్యో! “ఇంతకు ముందు ఎప్పుడూ అమ్మ ఈ ప్రక్క నుండి తిండి పట్టుకొచ్చేది అని ఒకే ధ్యాసతో, కళ్ళు తిప్పకుండా నల్దిక్కులా నిక్కి చూస్తూ ఉంటాయి. వాటి దీనమైన ముఖాలు ఎలా చూడాలి? కడుపు తరుక్కుపోయే ఆ రోదనలు భరించట మెలా?
७-६३-उत्पलमाल
र्रेक्कलु रावु पिल्ललकु र्रेपटिनुंडियु मेँत गानमिं
बोक्केडु गूटिलॉ नेगसि पोवँग नेरवु; मुन्नु तल्लि यी
दिक्कुननुंडि वच्चु ननि त्रिप्पनि चूड्कुल निक्किनिक्कि न
ल्दिक्कुलुँ जूचुचुन्न वतिदीनत नेट्लु भरिंतु नक्कटा!”
          ఱెక్కలు = రెక్కలు; రావు = ఇంకారాలేదు; పిల్లల్ = పిల్లల (పక్షి); కున్ = కు; ఱేపటి = రేపటి; నుండియున్ = నుంచి; మేతన్ = ఆహారమును; కానమిం = కనబడకపోవుటచేత; పొక్కెడున్ = ఏడ్చును; గూడు = నివాసము; లోన్ = నుండి; ఎగసిపోవగ = ఎగురుటకు; నేరవు = సమర్థములుగాదు; మున్ను = ఇంతకు పూర్వము; తల్లి = తల్లి పక్షి; = ; దిక్కున = వైపు; నుండి = నుండి; వచ్చును = వస్తూ ఉంటుంది; అని = అని; త్రిప్పని = ఇటునటు తిరగని; చూడ్కులన్ = చూపులతో; నిక్కినిక్కి = తలలునిక్కబొడిచి; నలు = నాలుగు (4); దిక్కులన్ = వైపులకును; చూచుచున్నవి = ఎదురుచూచుచున్నవి; అతి = మిక్కలి; దీనతన్ = జాలితో; ఎట్లు = ఏ విధముగ; భరింతున్ = ఓర్చుకొనగలను; అకటా = అయ్యో.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: