7-73-మత్తేభ విక్రీడితము
అదిరెం గుంభుని, సాద్రియై కలఁగె నే డంభోనిధుల్, తారకల్
చెదరెన్ సగ్రహసంఘలై, దిశలు విచ్ఛిన్నాంతలై మండెఁ, బె
ల్లదరెన్ గుండెలు జంతుసంహతికి, నుగ్రాచార
దైత్యేంద్రమూ
ర్ధదిశోద్ధూతసధూమ హేతిపటలోదంచత్తపోవహ్నిచేన్.
రాక్షసేంద్రుడైన
హిరణ్యకశిపుడు భీకర నియమాలతో తపస్సు చేస్తున్నాడు. అతని శిరస్సు పై నుండి పొగలు
లేచాయి. అగ్నిజ్వాలలు చెలరేగి మింటనంటసాగాయి. ఆ తాపానికి భూమండలం పర్వతాలతో సహా
కంపించి పోతోంది. సప్తసముద్రాలూ అల్లకల్లోలం కాసాగాయి. నక్షత్రాలు, గ్రహాలతో పాటు
చెదిరిపోతున్నాయి, దిక్కులన్నీ ఛిన్నాభిన్నాలై మండిపోతున్నాయి. జీవజాలం అంతటికి
గుండెలు దడదడలాడుతున్నాయి.
७-७३-मत्तॅभ
विक्रीडितमु
अदिरें गुंभुनि, साद्रियै कलँगे ने
डंभोनिधुल, तारकल
चेदरेन सग्रहसंघलै, दिशलु
विच्छिन्नांतलै मंडेँ, बे
ल्लदरेन गुंडेलु
जंतुसंहतिकि, नुग्राचार
दैत्येंद्रमू
र्धदिशोद्धूतसधूम
हेतिपटलोदंचत्तपोवह्निचेन.
అదిరెన్ = అదిరిపోయినది; కుంభిని = భూమి; సాద్రి = పర్వతములతోకూడినది; ఐ = అయ్యి; కలగెన్ = కలతబారెను; ఏడంభోనిధుల్ = సప్తసముద్రములు {సప్తసముద్రములు - 1లవణసముద్రము 2ఇక్షుసముద్రము 3సురాసముద్రము 4ఘృతసముద్రము 5దధిసముద్రము 6క్షీరసముద్రము 7జలసముద్రము}; తారకల్ = చుక్కలు; చెదరన్ = చెల్లాచెదురుయగునట్లు; సగ్రహసంఘలై = గ్రహకూటములతోకూడినవి; ఐ = అయ్యి; దిశలు = దిక్కులు; విచ్ఛిన్నాంతలు = చీలిన అంచులుగలవి; ఐ = అయ్యి; మండెన్ = మండిపోయినవి; పెల్లు = మిక్కిలి; అదరెనే = అదిరిపోయినవి; గుండెలు = గుండెలు; జంతు = జంతువుల; సంహతి = సమూహముల; కిన్ = కి; ఉగ్ర = దారుణమైన; ఆచార = ప్రవర్తనలుగల; దైత్య = రాక్షసుల; ఇంద్ర = రాజు యొక్క; మూర్ధ = తలలోనుండి; ఉద్ధూత = లేచిన; సద్ధూమహేతి = పగతోకూడిన మంటల; పటల = సమూహములతో; ఉదంచత్ = పొంగుతున్న; తపః = తపస్సు అనెడి; వహ్ని = అగ్ని; చేన్ = చేత;
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment