Saturday, July 4, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - అంత హిరణ్యకశిపుండు

7-37-వచనము
అంత హిరణ్యకశిపుండు దుఃఖితుండై, మృతుం డయిన సోదరునకు నుదక ప్రదానాది కార్యంబు లాచరించి, యతని బిడ్డల శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖుల నూఱడించి, వారల తల్లితోఁ గూడ హిరణ్యాక్షుని భార్యల నందఱ రావించి, తమ తల్లి యైన దితి నవలోకించి యిట్లనియె.
          అక్కడ హిరణ్యకశిపుడు మరణించిన తన తమ్ముడు హిరణ్యాక్షుడి కోసం దుఃఖించాడు. తిలోదకాలు మొదలైన అంత్యక్రియలు చేశాడు. అతని కొడుకులు శకుని, శంబరుడు, కాలనాభుడు, మదోత్కచుడు ఆది ప్రముఖులను పలకరించి ఉపశమనపు మాటలు పలికాడు. వాళ్ళ తల్లి, సవితి తల్లులు అయిన హిరణ్యాక్షుని భార్యలను పిలిచి, వారి సమక్షంలో తన తల్లి దితితో ఇలా అన్నాడు.
७-३७-वचनमु
अंत हिरण्यकशिपुंडु दुःखितुंडै, मृतुं डयिन सॉदरुनकु नुदक प्रदानादि कार्यंबु लाचरिंचि, यतनि बिड्डल शकुनि, शंबर, कालनाभ, मदॉत्कच प्रमुखुल नूर्रडिंचि, वारल तल्लितँ गूड हिरण्याक्षुनि भार्यल नंदर्र राविंचि, तम तल्लि यैन दिति नवलॉकिंचि यिट्लनिये.
            అంతన్ = తర్వాత; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; దుఃఖితుండు = దుఃఖించెడివాడు; = అయ్యి; మృతుండు = మరణించినవాడు; అయిన = అయిన; సోదరున = సహోదరున; కును = కు; ఉదకప్రదాన = తిలోదకప్రదానములు; ఆది = మొదలగు; కార్యంబులు = క్రియలు; ఆచరించి = చేసి; అతని = అతని; బిడ్డలన్ = పిల్లలను; శకుని = శకుని; శంబర = శంబరుడు; కాలనాభ = కాలనాభుడు; మదోత్కచ = మదోత్కచుడు; ప్రముఖులన్ = మొదలగుముఖ్యులను; ఊఱడించి = ఊరడించి; వారల = వారియొక్క; తల్లి = తల్లి; తోన్ = తో; కూడ = పాటు; హిరణ్యాక్షుని = హిరణ్యాక్షుని; భార్యలన్ = భార్యలను; అందఱన్ = అందరిని; రావించి = పిలిపించి; తమ = తమయొక్క; తల్లి = తల్లి; ఐన = అయిన; దితిన్ = దితిని; అవలోకించి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: