10.1-190-క.
జోజో కమలదళేక్షణ!
జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద!
జోజో పూర్ణేందువదన! జోజో యనుచున్.
జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద!
జోజో పూర్ణేందువదన! జోజో యనుచున్.
జోజో = బజ్జోనాయనాబజ్జో; కమల =
తామర; దళ = రేకులవంటి; ఈక్షణ = కన్నులు కలవాడా; జోజో =
బజ్జోనాయనాబజ్జో; మృగరాజ = సింహము వంటి; మధ్య =
నడుము కలవాడా; జోజో = బజ్జోనాయనాబజ్జో; కృష్ణా
= నల్లనయ్యా {కృష్ణుడు - సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములు
అనెడి పంచకృత్యములు చేయువాడు, శ్రీకృష్ణుడు}; జోజో =
బజ్జోనాయనాబజ్జో; పల్లవ = చిగురుటాకులవంటి; కర =
చేతులు; పద = పాదములు కలవాడా; జోజో =
బజ్జోనాయనాబజ్జో; పూర్ణ = నిండు; ఇందు =
చంద్రుని వంటి; వదన = మోము కలవాడా; జోజో =
బజ్జోనాయనాబజ్జో; అనుచున్ = అనుచు.
१०.१-१९०-क.
जॉजॉ कमलदळॅक्षण!
जॉजॉ मृगराजमध्य! जॉजॉ कृष्णा!
जॉजॉ पल्लवकरपद!
जॉजॉ पूर्णॅंदुवदन! जॉजॉ यनुचुन.
గోపికలు చిన్నికృష్ణునికి శుభ్రంగా
స్నానం చేయించి, నిద్రపుచ్చుతు – జోజో కమలదళేక్షణ! జోజో
మృగరాజమధ్య! జోజో కృష్ణా! జోజో పల్లవకరపద! జోజో పూర్ణేందువదన! జోజో అంటు జోలపాటలు
పాడారు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment