7-33-కంద పద్యము
ఖండిత మూలద్రుమమున
నెండిన విటపములభంగి నితఁడు పడిన, నా
ఖండలముఖ్యులు పడుదురు,
భండనమున నితఁడు దమకుఁ బ్రాఁణము లగుటన్.
విష్ణుడు వీళ్ళందరికి
మూలం ప్రాణం. కాబట్టి హరిని సంహరించానంటే, వీళ్ళ పనైపోతుంది. మాను నరికిన చెట్టు
కొమ్మలు ఎండిపోతాయి కదా. అలాగే నారాయణుని సంహరించేస్తే అమరుల ప్రభువు అయిన
ఇంద్రుడు మొదలగు ప్రముఖులు అందరూ కూడా యద్ధంలో ఓడిపోయి పడిపోతారు. అని రాక్షస వీరులకు హిరణ్యకశిపుడు
విష్ణువు మీద ద్వేషం రెచ్చగొడుతూ వీరావేశం కలిగిస్తున్నాడు.
७-३३-कंद पद्यमु
खंडित मूलद्रुममुन
नेंडिन विटपमुलभंगि नितँडु पडिन, ना
खंडलमुख्युलु पडुदुरु,
भंडनमुन नितँडु दमकुँ ब्राँणमु लगुटन.
ఖండిత = నరకబడిన; మూల = వేళ్ళుగల; ద్రుమమున = చెట్టునందలి; ఎండిన = ఎండిపోయిన; విటపముల = కొమ్మల; భంగిన్ = వలె; ఇతండు = ఇతడు; పడినన్ = మరణించిన; ఆఖండల = ఇంద్రుడు {ఆఖండలుడు - ఆఖండలులు (నాశనము లేనివా రైన దేవతల)కి ప్రభువు, ఇంద్రుడు}; ముఖ్యులు = మొదలగు
ముఖ్యమైనవారు; పడుదురు = పడిపోవుదురు; భండనమునన్ = యుద్ధమునందు; ఇతడు = ఇతను; తమ = వారల; కున్ = కు; ప్రాణములు = మూలాధారుడు; అగుటన్ = అగుటచేత.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment