Monday, August 1, 2016

క్షీరసాగరమథనం – తరుణికి

8-269-సీ.
రుణికి మంగళస్నానంబు చేయింత
ని పెట్టె నింద్రుఁ డర్ఘమైన
ణిమయ పీఠంబుమంగళవతులైన
వేలుపు గరితలు విమల తోయ
పూర్ణంబులై యున్న పుణ్యాహ కలశంబు
లిడిరి; పల్లవముల నిచ్చె భూమిఁ
డిమి గోవులు పంచవ్యంబులను నిచ్చె
లసి వసంతుండు ధు వొసంగె;
8-269.1-తే.
మునులు గల్పంబుఁ జెప్పిరిమొగిలుగములు
ణవ గోముఖ కాహళ టహ మురజ
శంఖ వల్లకీ వేణు నిస్వనము లిచ్చెఁ
బాడి రాడిరి గంధర్వ తులు సతులు.

టీకా:
            తరుణి = స్త్రీ; కిన్ = కి; మంగళస్నాంబున్ = మంగళస్నానములను; చేయింతము = చేయించెదము; అని = అని; పెట్టెన్ = నియమించెను; ఇంద్రుడు = ఇంద్రుడు; అనర్ఘమైన = వెలలేని; మణి = మణులు; మయ = పొదిగిన; పీఠంబున్ = పీటను; మంగళవతులు = పునిస్త్రీలు, ముత్తైదువలు; ఐన = అయిన; వేలుపు = దేవతా; గరితలున్ = ఇల్లాండ్రు; విమల = స్వచ్చమైన; తోయ = నీటితో; పూర్ణంబులు = నిండినవి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; పుణ్యాహ = మంగళాకరమైన; కలశంబుల్ = కడవలను; ఇడిరి = ఇచ్చిరి; పల్లవములను = చిగుళ్ళను; ఇచ్చెన్ = ఇచ్చెను; భూమిన్ = భూదేవి; కడిమిన్ = చివరగా; గోవులు = గోవులు; పంచగవ్యములన్ = పంచగవ్యములను; ఇచ్చెన్ = ఇచ్చెను; మలసి = పూని; వసంతుండు = వసంతుడు; మధువున్ = తేనెను; ఒసగెన్ = ఇచ్చెను. 
            మునులు = మునులు; కల్పంబున్ = సంకల్పమును; చెప్పిరి = చెప్పిరి; మొగిలు = మబ్బుల; గములు = గుంపులు; పణవ = ఉడుకలు, తప్పెటలు; గోముఖ = గోముఖములు; కాహళ = బాకాలు; పటహ = తప్పెళ్ళు; మురజ = మద్దెలలు; శంఖ = శంఖములు; వల్లకీ = వీణలు; వేణు = పిల్లనగ్రోవుల యొక్క; నిస్వనములన్ = ధ్వనులను; ఇచ్చెన్ = చేసెను; పాడిరి = పాడిరి; ఆడిరి = నాట్యములుచేసిరి; గంధర్వ = గంధర్వ; పతులు = పురుషులు; సతులు = స్త్రీలు.

భావము:
            ఇలా జనులు అందరూ పొగడుతుండగా, జవరాలైన లక్ష్మీదేవికి మంగళస్నానం చేయించడం కోసం ఇంద్రుడు వెలకట్టలేని రత్నాలు పొదిగిన పీఠం అమర్చాడు. దేవతా ముత్తైదువలు కడవలతో నిండుగా నిర్మలమైన నీళ్ళు తెచ్చారు, భూదేవి ఆ కళశాలలోకి చిగుళ్ళను ఇచ్చింది. ఆవులు పాలూ పెరుగూ నెయ్యీ పంచిత గోమయాలు అనే పంచ గవ్యాలనూ ఇచ్చాయి. వసంతుడు విరివిగా తేనె అందించాడు. మునులు సంకల్పం చెప్పారు. మేఘాలు పణవాలూ, గోముఖాలూ, బాకాలూ, తప్పెట్లూ, మద్దెలలూ, శంఖాలూ, వీణలూ, వేణువులూ మ్రోగినట్లు ధ్వనించాయి. గంధర్వులు పాడారు. గంధర్వ కాంతలు నాట్యాలు ఆడారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: